నేను తేజస్వీ యాదవ్ మాట్లాడుతున్నా డీఎం సాబ్.. వైరల్ వీడియో చూడాల్సిందే

నేను తేజస్వీ యాదవ్ మాట్లాడుతున్నా డీఎం సాబ్.. వైరల్ వీడియో చూడాల్సిందే

“This Is Tejashwi Yadav Speaking”. A Phone Call In Bihar Goes Viral ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన మార్క్ సత్తా చూపించి జేడీయూ-బీజేపీ కూటమికి చెమటలు పట్టించి ఆర్జేడీని అతిపెద్ద పార్టీగా నిలిపిన లాలూ తనయుడు తేజస్వీ యాదవ్ మాట్లాడిన ఓ ఫోన్ కాల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ఉన్నతాధికారితో తేజస్వీ జరిపిన ఫోన్ సంభాషణ కు సంబంధించిన వీడియో క్లిప్ వైరల్ గా మారింది.

బుధవారం బీహార్ రాజధాని పాట్నాలో టీచర్లు.. తమ సమస్యలపై ముందుగా నిర్ణయించుకున్న స్థలంలో ధర్మా చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వ అధికారులను కోరారు. అయితే పర్మిషన్ రాకపోగా.. పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేశారు. దీంతో విషయం తెలుసుకున్న తేజస్వీ యాదవ్..తన మద్దతు తెలిపేందకు టీచర్లు ధర్మా చేస్తున్న ప్రాంతానికి చేరుకున్నారు. చీఫ్ సెక్రెటరీ, పోలీస్ చీఫ్‌‌తోపాటు పాట్నా డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్‌(DM) ‌తో ఫోన్‌‌లో మాట్లాడి ధర్మాకు పర్మిషన్ ఇప్పించారు. చుట్టూ ఉపాధ్యాయులు ఉండగా, తేజస్వీ యాదవ్ జిల్లా మెజిస్ట్రేట్ చంద్రశేఖర్ సింగ్‌కు ఫోన్ చేసి, లౌడ్ స్పీకర్ పెట్టి మరీ మాట్లాడారు

మెజిస్ట్రేట్ చంద్రశేఖర్‌ సింగ్‌‌తో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఫోన్ సంభాషణ:
తేజస్వీ : టీచర్లకు ధర్నా చేసుకునేందుకు అనుమతి ఇవ్వడం లేదు. పర్మిషన్ ఇవ్వాలని ప్రతి రోజూ పోలీసులను అడగాలా? వీళ్లపై లాఠీచార్జ్ చేశారు. వారు తెచ్చుకున్న టిఫిన్ డబ్బాలను విసిరేశారు. వీళ్లందరూ చెల్లాచెదురయ్యారు. మిగిలిన కొందరు ఎకో పార్క్ వద్ద ఉన్నారు. నిరసన తెలపడం వారి ప్రజాస్వామ్య హక్కు. అది చేసుకోనివ్వండి. వీళ్ల దరఖాస్తును మీకు వాట్సాప్ చేస్తా. దయచేసి నిరసన తెలిపేందుకు ఉపాధ్యాయులను అనుమతించండి.
డీఎం : వాట్సాప్ లో పంపండి.. తప్పకుండా పరిశీలిస్తా.
తేజస్వీ: అనుమతి ఎప్పుడు ఇస్తారో చెప్పండి?
డీఎం : ఎప్పుడా? నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావా?
తేజస్వీ: డీఎం సాబ్ నేను తేజస్వీ యాదవ్ మాట్లాడుతున్నా.
డీఎం : హా సార్…. సార్… సార్… చెప్పండి..ఓకే సార్
తేజస్వీ : నేను మీకు వాట్సాప్ ద్వారా అప్లికేషన్ పంపుతాను. తొందరగా స్పందించండి. లేదంటే రాత్రి వరకూ ఇక్కడే ధర్నాలో కూర్చుంటాం అంటూ కాల్ కట్ చేశారు.