మహీంద్రా థార్ హారన్ కోసం రూ.1లక్ష వెచ్చించాల్సిందే..

మహీంద్రా థార్ హారన్ కోసం రూ.1లక్ష వెచ్చించాల్సిందే..

Mahindra Thar: ప్రపంచంలోనే అత్యంత శబ్ధపూరిత హారన్ వాడేది ఇండియన్ రోడ్లమీదనే. ప్రతిఒక్కరికీ చిరాకుగా అనిపించే హారన్ వాడటానికే చాలా మంది ఇష్టపడుతుంటారు. రోడ్లపై శబ్ధ కాలుష్యం పెద్ద సమస్యగా మారిందని.. అది పెద్దగా వచ్చిన ప్రతీసారి పోలీసులు హెచ్చరిస్తూనే ఉంటున్నారు. ఇందులో కొందరు అక్రమంగానూ హారన్లు వాడుతుంటారు.

విదేశీ మార్కెట్ల నుంచి తెప్పించుకుని వాడేందుకు చాలా మంది ఇంట్రస్టింగ్ చూపిస్తుంటారు. అలాగే ఓ వ్యక్తి మహీంద్రా థార్ హారన్ కోసం దాదాపు రూ.లక్ష ఖర్చు పెట్టాడు. కెనడా నుంచి తెప్పించి దానిని తన వాహనానికి అమర్చుకున్నాడు. అయితే దాని శబ్దం ట్రైన్ సైరన్‌ను పోలి ఉంది.

ఈ హారన్ గట్టిగా వినిపించినప్పుడు.. ట్రైన్ హారన్ ను పోలి ఉంటుందని చెప్పుకొచ్చాడు. దీని కోసం పెద్ద సెటప్ నే రెడీ చేశాడట. కళ్లకు కనిపించే దాని కంటే చాలా రెట్లు ఎక్కువగా ఇది వినిపిస్తుంది. దీని కోసం సపరేట్ కంప్రెస్సర్ సెట్ చేసి ఉంచారు. పైగా దీనిని గుంపుగా ఉండే ప్రదేశాల్లో నొక్కకుండా సపరేట్ బటన్ కూడా ఉంచారు.

కంప్రెస్సర్ లో ఉన్న గాలి.. డ్రైవర్ ట్రిగ్గర్ చేయగానే రిలీజ్ అయి హారన్ మోగేలా చేస్తుంది. అవసరమైనప్పుడు టైర్లలో గాలి నింపుకునేందుకు కూడా ఎయిర్ ట్యాంక్ హెల్ప్ అవుతుంది. చాలా రోడ్ వెహికల్స్ నడిపేవారు పోర్టబుల్ ఎయిర్ కంప్రెసర్ ను వాడుతుంటారు. రోడ్ ను బట్టి టైర్లలో గాలి అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అటువంటి సమయంలో ఈ కంప్రెస్సర్ యూజ్ అవుతుంది.

రూల్స్ ఏమంటున్నాయి?
రూల్స్ ప్రకారం.. హారన్ శబ్ధం 112 డెసిబల్స్ కు మించి వినపడకూడదు. డెసిబల్ మీటర్ మీద ఇలాంటి లౌడ్ హారన్స్ పెట్టినప్పుడు కచ్చితంగా 130 నుంచి 150 డెసిబల్స్ మధ్యనే వినిపిస్తుంటుంది. కానీ, అది డేటాలో అంతగా కనిపిస్తుందని చెప్పలేం.

కేరళలో పోలీసులు ఈ సౌండ్ మీటర్లతో రెడీగా నిల్చొని హారన్ నుంచి శబ్దాలపై కన్నేస్తుంటారు. పర్మిషన్ ఉన్న లిమిట్ కంటే ఎక్కువ శబ్దం వినిపించే వాహనాలకు చలానా కంపల్సరీ. దేశంలోని మిగిలిన కొన్ని ప్రాంతాల్లో అటువంటి చెకింగ్స్ ఏమీ ఉండవు.