Grooms for Sale : మార్కెట్‌లో పెళ్లి కొడుకులు-నచ్చిన వారిని కొనుక్కోవటమే

బీహార్‌లోని మధుబాని జిల్లాలో ప్రతిఏటా పెళ్లికొడుకుల మార్కెట్‌ నిర్వహిస్తారు. స్థానికులు ఈ పద్ధతిని సౌరత్‌ సభా అని పిలుస్తారు.

Grooms for Sale : మార్కెట్‌లో పెళ్లి కొడుకులు-నచ్చిన వారిని కొనుక్కోవటమే

grooms for sale

Grooms for Sale : పెళ్లైన కొత్తలో అనే తెలుగు సినిమాలో హస్య నటుడు సునీల్, వేణు మాధవ్‌లతో ఒక కామెడీ సీన్ ఉంటుంది. హైటెక్‌ మ్యారేజ్‌ బ్యూరో పేరుతో సునీల్‌ పెళ్లి కొడుకులను విక్రయానికి పెడతాడు. అక్కడకు వేణు మాధవ్ పెళ్లి కొడుకుగా వస్తాడు. అప్పుడు దర్శకుడు అక్కడ చెప్పించే డైలాగ్ లు ప్రస్తుతం సమాజంలో పెళ్లికాని మగవారి పరిస్ధితికి అద్దం పడుతుంది.

ఆ సినిమాలో చూపించినట్లుగానే మార్కెట్లో కూరగాయలు కొనుగోలు చేసినట్లు పెళ్లి కొడుకులను కొనుగోలు చేయటం అనేది మీరెప్పుడైనా విన్నారా…. అలాంటి వింత పరిస్ధితి ఉందని తెలుసా మీకు… ఎక్కడంటారా…. బీహార్ లో మార్కెట్ లో నచ్చిన పెళ్లి కొడుకుని కొనుక్కని వెళ్ళటమే. బీహార్‌లోని మధుబాని జిల్లాలో ప్రతిఏటా పెళ్లికొడుకుల మార్కెట్‌ నిర్వహిస్తారు. స్థానికులు ఈ పద్ధతిని సౌరత్‌ సభా అని పిలుస్తారు. స్థానిక మార్కెట్‌ ప్రాంతంలోని చెట్ల కిందే ప్రతిఏటా 9 రోజుల పాటు ఈ పెళ్లి కొడుకుల విక్రయాలు నిర్వహిస్తారు.

జిల్లా వ్యాప్తంగా ఉన్న మైతిల్ బ్రాహ్మిన్ సమాజానికి చెందిన వారు తమ కుమార్తెలను తీసుకుని ఈ మార్కెట్‌కు వస్తారు. వారికి నచ్చిన వారిని ఎంపిక చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఈ మార్కెట్లో వేల మంది పెళ్లి కొడుకులు వారి కుటుంబ సభ్యులతో వస్తారు. సంప్రదాయ ధోతి, కుర్తా లేదా జీన్స్‌, టీషర్ట్‌ ధరిస్తారు. వారి ఆస్తులు, విద్యా అర్హతలను బట్టి వారికి రేటు నిర్ణయిస్తారు. ఈ సంప్రదాయం సుమారు 700 ఏళ్ల నుంచి వస్తున్నట్లు అక్కడి వారు చెబుతున్నారు.

పెళ్లి కొడుకును కొనుగోలు చేసే ముందు అతడి అర్హతలు, కుటుంబ నేపథ్యాన్ని పరిశీలిస్తారు ఆడపిల్లల కుటుంబం వారు.. అలాగే పుట్టినరోజు, విద్యార్హతల సర్టిఫికెట్లను కూడా అడుగుతారు. తనకు అన్నివిధాలా నచ్చిన వరుడ్ని, వధువు ఎంపిక చేసుకున్న తర్వాత రెండు కుటుంబాల వారు మిగతా పెళ్లి విషయాలు మాట్లాడుకుంటారు. పెళ్లిని ఆడపిల్ల కుటుంబమే జరుపుతుంది. కర్నాత్‌ రాజుల వంశం పరిపాలించిన నాటినుంచిఈ సంప్రదాయం వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. వివిధ గోత్రాల మధ్య పెళ్లిళ్లు సులభతరం చేసేందుకు రాజా హరిసింగ్‌ దీనిని ప్రారంభించినట్లు తెలిపారు. మరోవైపు.. వివాహాలు కట్నం లేకుండా చేయటమే దీని లక్ష్యంగా మరికొందరు తెలిపారు.