Hot Summer : ముందుంది మండే కాలం.. ఈ వేసవిలో నిప్పులే, ముందే రానున్న సమ్మర్, మరింతగా మండిపోనున్న ఎండలు

ఈ ఏడాది మండిపోయే ఎండలను తట్టుకునేందుకు అంతా సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే, నాలుగేళ్ల గ్యాప్ తర్వాత వాతావరణంలో మళ్లీ ఎల్ నినో పరిస్థితులు రాబోతున్నాయి. ఈసారి ఎండాకాలం ముందే మొదలవడంతో పాటు మండే ఉష్ణోగ్రతలు కూడా ఉక్కిరిబిక్కిరి చేయబోతున్నాయి. అందువల్ల ఇప్పటి నుంచే సమ్మర్ సీజన్ ను తట్టుకునేందుకు ప్రిపేర్ అయిపోవాల్సిందే. వడ దెబ్బ తగలకుండా తప్పించుకోవడం ఎలాగో ప్లాన్ చేసుకోవాలి

Hot Summer : ముందుంది మండే కాలం.. ఈ వేసవిలో నిప్పులే, ముందే రానున్న సమ్మర్, మరింతగా మండిపోనున్న ఎండలు

Hot Summer : ఈ ఏడాది మండిపోయే ఎండలను తట్టుకునేందుకు అంతా సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే, నాలుగేళ్ల గ్యాప్ తర్వాత వాతావరణంలో మళ్లీ ఎల్ నినో పరిస్థితులు రాబోతున్నాయి. ఈసారి ఎండాకాలం ముందే మొదలవడంతో పాటు మండే ఉష్ణోగ్రతలు కూడా ఉక్కిరిబిక్కిరి చేయబోతున్నాయి. అందువల్ల ఇప్పటి నుంచే సమ్మర్ సీజన్ ను తట్టుకునేందుకు ప్రిపేర్ అయిపోవాల్సిందే. వడ దెబ్బ తగలకుండా తప్పించుకోవడం ఎలాగో ప్లాన్ చేసుకోవాలి.

ఫిబ్రవరి నెలలోనే సూర్యుడు మంటెక్కిస్తున్నాడు. గడిచిన నాలుగేళ్లలో ఎండా కాలం అంటే ఏదో అలా గడిచిపోయింది. కానీ, ఈసారి అలా ఉండదు. ఈసారి రాబోయే ఎండాకాలం మండిపోనుంది. పైగా ఈ ఏడాది సమ్మర్ సీజన్ కాస్త ముందుగానే మొదలవబోతోంది. ఎండలు కూడా సాలిడ్ గా ఉండబోతున్నాయి. అందువల్ల ఇప్పటి నుంచే సమ్మర్ ను ఎదుర్కొనేందుకు ప్రిపేర్ అవ్వాల్సిందే.

Also Read..Kottayam Hot Weather : దేశవ్యాప్తంగా చలి చంపుతుంటే.. అక్కడ మాత్రం ఎండలు మండిపోతున్నాయి

ఈ ఏడాది ఎండాకాలంతో అంత ఈజీ కాదు. ఈ వేసవిలో ఎండలు మండిపోనున్నాయి. ఇందుకు దేశంలో ఎల్ నినో పరిస్థితులే కారణం అని వాతావరణ నిపుణులు వివరిస్తున్నారు.

అమెరికాకు చెందిన ఓ వాతావరణ సంస్థ రిలీజ్ చేసిన రిపోర్టు ప్రకారం భారత్ లో జూన్, జూలై, ఆగస్టులో ఎల్ నినో పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇక జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ లో అయితే ఎల్ నినో పరిస్థితులు నెలకొనే అవకాశాలు 58శాతం ఎక్కువగా ఉందని తేల్చారు.

Also Read..Summer In India: ముందుగానే రానున్న ఎండాకాలం.. ప్రజల ప్రాణాలకు ముప్పు తప్పదంటున్న ప్రపంచ బ్యాంకు

ఫలితంగా ఈసారి వర్షపాతం తక్కువగా నమోదవుతుందని చెబుతున్నారు. ఎల్ నినో ప్రభావం దేశంపై ఎలా ఉండబోతోందన్నది ఈ ఏప్రిల్ నుంచి మే మధ్య కాలంలో తెలిసిపోతుంది. నిపుణులుకూడా ఈ వేసవిలో ఎండలు మండిపోతాయని చెబుతున్నారు.

ఎల్ నినో, లా నినా.. వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయన్నది సూచిస్తాయి. ఎల్ నినో అంటే అసాధరణమైన ఉష్ణోగ్రతలు ఉంటాయి. అదే లా నినా అంటే చలి గాలులు ఎక్కువగా వీస్తాయి. సాధారణంగా భారత్ లో ఎల్ నినో సంవత్సరంలో వర్షపాతం తగ్గుతూ ఉంటుంది. 2018లో దేశంలో చివరగా ఎల్ నినో పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత నాలుగేళ్ల పాలు మంచి రుతుపవనాలు వచ్చాయి.

గతేడాది శీతాకాలంలో అయితే ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, రాజస్తాన్ తో సహా అనేక భారతీయ రాష్ట్రాల్లో కోల్డ్ వేవ్ పరిస్థితులు నెలకొన్నాయి. వర్షపాతం ఎక్కువ రోజులు నమోదవడం, మంచు కురవడంతో పాటు వడగండ్ల వానలు ఉష్ణోగ్రతలు పడిపోయేందుకు కారణమయ్యాయి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

కానీ, ఈసారి పరిస్థితులు అలా లేవు. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో పగటి ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. సాధారణం కంటే కనీసం 5 డిగ్రీల టెంపరేచర్ ఎక్కువగా నమోదు అవుతోంది. ఢిల్లీలోని సఫ్దర్ గంజ్ ప్రాంతంలో దాదాపు 30 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇది సాధారణం కంటే 7 డిగ్రీలు ఎక్కువ.

ఇంత త్వరగా వేసవి పరిస్థితులు రావడం కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితం అయ్యేది కాదు. పైగా అక్కడ ఇవి తాత్కాలికం కూడా కావు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని కూడా భారత వాతావరణ శాఖ చెప్పడం లేదు. దీన్ని బట్టి ముందు ముందు టెంపరేచర్ టెంపర్ మామూలుగా ఉండదని అర్థం చేసుకోవాలి.