Little Boy Dancing : ఔరా బుడ్డోడా..! స్టెప్పులతో డాన్స్ ఇరగదీశాడు

ఓ బుడ్డోడు చేసిన డ్యాన్స్ కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. చిన్న పిల్లాడు అయినా..ఏం డ్యాన్స్ చేశాడురా ? అంటూ కితాబిస్తున్నారు. డప్పుల దరువుకు అనుగుణంగా అతను వేసిన తీన్మార్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. Awanish Sharan IAS ఆఫీసర్ ఈ వీడియోను ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఎక్కడ ఈ వీడియో తీశారో తెలియలేదు

Little Boy Dancing : ఔరా బుడ్డోడా..! స్టెప్పులతో డాన్స్ ఇరగదీశాడు

Dance

Little Boy Dancing : ఓ బుడ్డోడు చేసిన డాన్స్ కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. చిన్న పిల్లాడు అయినా..ఏం డాన్స్ చేశాడురా ? అంటూ కితాబిస్తున్నారు. డప్పుల దరువుకు అనుగుణంగా అతను వేసిన తీన్మార్ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. Awanish Sharan IAS ఆఫీసర్ ఈ వీడియోను ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఎక్కడ ఈ వీడియో తీశారో తెలియలేదు.

Read More : Street Vendors : వీధి వ్యాపారం చేస్తూ కోట్లు సంపాదించారు.

బురదలో ఓ బుడ్డోడు నిల్చొన్నాడు. మాస్క్ పెట్టుకుని ప్యాంట్, షర్ట్ వేసుకున్నాడు. అతనికి ఎదురుగా డప్పులు పట్టుకుని కొందరు నిలబడ్డారు. డప్పులు వాయించగా..అతను బుడ్డోడు కాళ్లు కదిపాడు. మధ్యలో ఆపివేయగా..ఎవరో ‘య్’ అనే అనడంతో..ఆ చిన్నోడు ప్యాంటు పైకి అనుకుని..డప్పు చప్పుళ్లకు అనుగుణంగా మాస్ డాన్స్ చేశాడు. ఇతని డాన్స్ చూసి చాలా మంది అక్కడ గుమికూడారు. ఎవరు చూస్తున్నారు..చుట్టుపక్కల వాతావరణాన్ని ఏమీ పట్టించుకోకుండా..చిన్నోడు డాన్స్ చేశాడు.

Read More : Cloud Seeding : మేఘాల‌కు డ్రోన్లతో క‌రెంట్ షాకిచ్చి..వ‌ర్షం కురిపించిన దుబాయ్‌..

అయితే..ఈ సమయంలో ఎక్కడా అతను మాస్క్ తీయకపోవడం విశేషం. పోస్టు చేసిన కొద్దిసేపట్లోనే వైరల్ గా మారింది. 71.2K views రాగా..చాలా మంది లైక్ కొట్టారు. ఇతని డాన్స్ కు ఫిదా అయిపోతున్నారు. చిన్నోడిని మెచ్చుకుంటూనే..మాస్క్ తీయకుండా డాన్స్ వేసిన విధానం అందర్నీ ఆకట్టుకొంటోంది. పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.