1933 Wedding Card: 1933, ఏప్రిల్ 23న పెళ్లి… అప్పటి శుభలేఖ ఇది

తాజాగా, ఓ మహిళ తన తాత, నానమ్మల శుభలేఖను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. వారి పెళ్లి 1933లో జరిగిందని, ఇది అప్పటి శుభలేఖ అని చెప్పింది. పాకిస్థాన్ లోకి కరాచీకి చెందిన ఫ్యాషన్ డిజైనర్ సోన్యా బట్లా ఈ ఫొటోను పోస్ట్ చేసింది. ఆమె తాత, నానమ్మ పెళ్లి ఢిల్లీలో జరిగింది.

1933 Wedding Card: 1933, ఏప్రిల్ 23న పెళ్లి… అప్పటి శుభలేఖ ఇది

1933 Wedding Card

1933 Wedding Card: పెళ్లికి ముందు శుభలేఖలు పంచే సంప్రదాయం ఎప్పటినుంచో ఉంది. పెళ్లికూతురు, పెళ్లికొడుకు తమ శుభలేఖను జీవితాంతం మధుర జ్ఞాపకంగా దాచి పెట్టుకుంటారు. ఇప్పుడు ఎన్నో రకాల ముద్రణాయంత్రాలు ఉన్నాయి. ఎన్నో రకాల డిజైన్ల శుభలేఖలు అచ్చు వేయిస్తున్నారు. కొన్ని దశాబ్దాల క్రితం చేతిరాతతో మొదటి శుభలేఖ రాసుకుని, ముద్రించేవారు.

తాజాగా, ఓ మహిళ తన తాత, నానమ్మల శుభలేఖను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. వారి పెళ్లి 1933లో జరిగిందని, ఇది అప్పటి శుభలేఖ అని చెప్పింది. పాకిస్థాన్ లోకి కరాచీకి చెందిన ఫ్యాషన్ డిజైనర్ సోన్యా బట్లా ఈ ఫొటోను పోస్ట్ చేసింది. ఆమె తాత, నానమ్మ పెళ్లి ఢిల్లీలో జరిగింది. ఆమె పోస్ట్ చేసిన ఈ లేఖ ఫొటో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. ఈ శుభలేఖ ఉర్దూలో ఉంది.

కొందరు నెటిజన్లు దాన్ని ఇంగ్లిష్ లో ట్రాన్స్‌లేట్ చేశారు. ముహమ్మద్ ఇబ్రహీం అనే వ్యక్తి అప్పట్లో తన కుమారుడు హఫీజ్ ముహమ్మద్ యూసఫ్ పెళ్లి కోసం ఈ శుభలేఖ వేయించారని ఓ వ్యక్తి ఇంగ్లిష్ లో ట్రాన్స్ లేట్ చేసి చెప్పాడు. ఆ పెళ్లి 1933, ఏప్రిల్ 23లో జరగనున్నట్లు శుభలేఖలో ఉందని అన్నారు. ఢిల్లీలోని కసీమ్ జాన్ వీధిలో పెళ్లి జరుగుతుందని ఉందని చెప్పారు. పెళ్లి కూతురి చిరునామాగా కిషన్ గంజ్ ఉందని అన్నారు. అప్పటి ఈ శుభలేఖపై నెటిజన్లు అమితాసక్తి కనబర్చుతున్నారు.


Viral Video: కారులో యువతిని కిడ్నాప్ చేసేందుకు విఫలయత్నం… వీడియో