18ఏళ్లు దాటినవారందరికీ కరోనా వ్యాక్సిన్ : కేంద్రం

దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్ విజృంభిస్తోన్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

18ఏళ్లు దాటినవారందరికీ కరోనా వ్యాక్సిన్ : కేంద్రం

Those Above 18 Eligible To Get Covid Vaccine From May 1 Centre

Covid Vaccine దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్ విజృంభిస్తోన్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సినేషన్ డ్రైవ్ ను మరింత వేగంగా చేపట్టాలని నిర్ణయించింది. మే-1,2021నుంచి 18ఏళ్లు పైబడిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. రెండు రోజులుగా అధికారులతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ వరుస సమావేశాలు నిర్వహించిన తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం సోమవారం ప్రకటించింది.

ఇప్పటివరకు కేంద్రం ఫ్రంట్ లైన్ వర్కర్లు, 45ఏళ్లు పైబడినవారికి మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చేందుకు అనుమతించిన విషయం తెలిసిందే. వీలైనంత తక్కువ సమయంలో పెద్దసంఖ్యలో భారతీయులకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏడాదికాలంగా కేంద్రప్రభుత్వం కృష్టి చేస్తోందని ప్రధాని మోడీ తెలిపారు. దేశవ్యాప్తంగా కొద్దిరోజులుగా రోజుకి 2లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతున్న వేళ మే-1నుంచి ప్రారంభం కానున్న ఫేజ్-3 కోవిడ్ వ్యాక్సినేషన్ లో పెద్దలందరికీ(18ఏళ్లు దాటిన) వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.

ఇక, రాష్ట్రాల అవసరాలకు తగినట్లుగా వ్యాక్సిన్ వినియోగానికి వెసులుబాటు ఇచ్చింది కేంద్రం. కేంద్రం ఇచ్చే డోసులకు అదనంగా కావాలంటే వ్యాక్సిన్ తయారీ కంపెనీల నుంచే రాష్ట్రాలు నేరుగా వ్యాక్సిన్ ను కొనుగోలు చేయొచ్చని కేంద్రం తెలిపింది. వ్యాక్సిన్ తయారీదారులు ఉత్పత్తిలో 50శాతం రాష్ట్రాలకు,బహిరంగ మార్కెట్లో విడుదల చేసుకోవచ్చని తెలిపింది.
.