కొనేవాళ్లులేక 6వేల కోళ్లను పూడ్చేశారు

చైనాలోని వుహాన్ లో వెలుగు చూసిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. మనుషుల ప్రాణాలు తీస్తోంది. వేలాది మంది మృత్యువాత పడ్డారు. లక్షలాది మంది కరోనా

  • Published By: veegamteam ,Published On : March 12, 2020 / 09:26 AM IST
కొనేవాళ్లులేక 6వేల కోళ్లను పూడ్చేశారు

చైనాలోని వుహాన్ లో వెలుగు చూసిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. మనుషుల ప్రాణాలు తీస్తోంది. వేలాది మంది మృత్యువాత పడ్డారు. లక్షలాది మంది కరోనా

చైనాలోని వుహాన్ లో వెలుగు చూసిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. మనుషుల ప్రాణాలు తీస్తోంది. వేలాది మంది మృత్యువాత పడ్డారు. లక్షలాది మంది కరోనా బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 2019 డిసెంబర్ లో వెలుగుచూసిన కరోనా.. చైనాని సర్వ నాశనం చేసింది. ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది. ఇప్పటికే 100కు పైగా దేశాల్లో కరోనా వ్యాపించింది. కరోనాను ప్రపంచ మహమ్మారిగా డబ్ల్యూహెచ్ వో ప్రకటించిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

సంక్షోభంలో పౌల్ట్రీ పరిశ్రమ:
కరోనా ప్రభావం అన్ని రంగాలపైనా పడింది. ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. మరీ ముఖ్యంగా పౌలీ పరిశ్రమ సంక్షోభంలో పడింది. చికెన్‌ తింటే కరోనా వస్తుందనే వదంతులు ప్రచారం కావడంతో.. ఆ ప్రభావం పౌల్ట్రీ పరిశ్రమపై పడింది. చికెన్‌ ధరలు భారీగా పడిపోయాయి. కోడి తినే వాళ్లే కరువయ్యారు. దీంతో పౌల్ట్రీ వ్యాపారులు తీవ్రమైన నష్టాలు చూస్తున్నారు. నష్టాలతో మనస్తాపం చెందిన ఓ పౌల్ట్రీ నిర్వహకుడు తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడు. ప్రాణాలతో ఉన్న వేలాది కోళ్లను సజీవంగా పూడ్చిపెట్టాడు.(coronavirus : కోళ్లు ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ)

6వేల 500 కోళ్లు, 9వేల 500 కోడి పిల్లలు సజీవ సమాధి:
కర్నాటక రాష్ట్రం బెళగావి జిల్లాలో నజీర్‌ అహ్మద్‌ అనే పౌల్ట్రీ నిర్వహకుడు తన పౌల్ట్రీలోని 6 వేల కోళ్లను ఓ ట్రక్‌లో తరలించి పెద్ద గుంత తీసి అందులో పూడ్చిపెట్టాడు. ప్రొక్లెయినర్ తో భారీ గుంతను తవ్వించిన నజీర్.. అందులో 6 వేల 500 కోళ్లు, 9వేల 500 కోడి పిల్లలను పూడ్చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కోళ్లతో కరోనా వస్తుందనే వదంతుల కారణంగా చికెన్‌ ధరలు భారీగా పడిపోయాయని, కోళ్ల పెంపకానికి రూ.6 లక్షల ఖర్చు చేయాల్సి వచ్చిందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పెట్టుబడి రాకపోగా.. నష్టాలు వచ్చే అవకాశం ఉందని నజీర్ వాపోయాడు. అందుకే కోళ్లను బతికుండగానే ఇలా పూడ్చి పెట్టినట్టు వెల్లడించాడు.

చికెన్ తింటే కరోనా వస్తుందని ప్రచారం:
చికెన్ తింటే కరోనా వైరస్ వ్యాపిస్తుందనే భయంతో పౌల్ట్రీ పరిశ్రమ తీవ్ర నష్టాల పాలవుతోంది. చికెన్ రేట్లు అమాంతం పడిపోయాయి. పలు చోట్ల కేజీ చికెన్ రూ. 30కే దొరుకుతుంది. పోషణ ఖర్చు పెరగడం, వ్యాపారంలో నష్టాలు రావడంతో కర్ణాటకలో వేలాది బ్రాయిలర్ కోళ్లను సజీవంగా పూడ్చేస్తున్నారు. చికెన్ తినడం వల్ల కరోనా రాదని ప్రభుత్వాలే చెబుతున్నా.. ప్రచారం చేస్తున్నా, ప్రజలు మాత్రం కోడి మాంసానికి దూరంగానే ఉంటున్నారని చికెన్ షాపుల వ్యాపారులు, పౌల్ట్రీ నిర్వాహకులు వాపోతున్నారు.

See Also | అప్పు తీసుకున్న మహిళకు వడ్డీ వ్యాపారుల లైంగిక వేధింపులు..తట్టుకోలేక ఆత్మహత్య