No jobs in West Bengal: పరీక్షలు పాసైన వారందరికి ఉద్యోగాలు ఎక్కడి నుంచి తేవాలి: బెంగాల్ మంత్రి వ్యాఖ్యలు

ఉద్యోగం కోసం అనేక మంది యువతీయువకులు తమ ఇంటికి వస్తున్నారని కానీ రాష్ట్రంలో ఉద్యోగాలు లేవని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

No jobs in West Bengal: పరీక్షలు పాసైన వారందరికి ఉద్యోగాలు ఎక్కడి నుంచి తేవాలి: బెంగాల్ మంత్రి వ్యాఖ్యలు

Bengal

No jobs in West Bengal: “ఇక్కడ రాష్ట్రం (పశ్చిమ బెంగాల్)లో ఉద్యోగాలు లేవు, వేలాది మంది బాలబాలికలు పరీక్షల్లో ఉత్తీర్ణులై బయటకు వస్తున్నారు. వారందరు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు” సాక్షాత్తు ఒక రాష్ట్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. బెంగాల్ వ్యవసాయశాఖ మంత్రి సోవన్ దేవ్ ఛటర్జీ శనివారం జరిగిన ఒక సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. “12 లక్షల మంది అభ్యర్థులు మాధ్యమిక్ లో ఉత్తీర్ణులయ్యారు. విద్యావంతులైన నిరుద్యోగులందరినీ సృష్టించారు. గ్రాడ్యుయేషన్, ఎం.ఎ. తర్వాత కూడా ఉద్యోగం లేదు. నా ఇంటికి వచ్చే వారిలో సగం మంది ఉద్యోగం కోసం మాత్రమే అడుగుతారు. కానీ మీరు ఎక్కడికి వెళ్లి ఉద్యోగం తెచ్చుకోగలరు?” అంటూ మంత్రి సోవన్ దేవ్ వ్యాఖ్యానించారు.

Other Stories: Assam CM Himantha: మనీశ్ సిసోడియాపై పరువు నష్టం దావా వేస్తా: అస్సాం సీఎం హిమంతా బిస్వా

ఈ సంవత్సరం సెకండరీ పరీక్షలో 12 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని ఇది మొత్తం అభ్యర్థుల్లో 86 శాతంగా ఉందని ఆయన అన్నారు. ఉద్యోగం కోసం అనేక మంది యువతీయువకులు తమ ఇంటికి వస్తున్నారని కానీ రాష్ట్రంలో ఉద్యోగాలు లేవని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. హయ్యర్ సెకండరీ, తరువాత గ్రాడ్యుయేషన్, మాస్టర్స్, పాలిటెక్నిక్ చదువులు ఉంటాయని, ప్రతిరోజూ వేల సంఖ్యలో విద్యార్థులు ఉత్తీర్ణులై బయటకు వస్తున్నారని కానీ, వారికి మార్గనిర్దేశం చేసేవారెవరూ లేరని ఆయన ఆవేదన చెందారు.

Other Stories: Delhi hospital: ఏడేళ్ల తర్వాత తినడానికి, మాట్లాడటానికి వీలు కల్పించిన సర్జరీ

“ప్రతిరోజూ ఉదయం నేను నా నివాసంలో సాధారణ ప్రజలను కలుస్తాను. 10 మందిలో కనీసం 5 మంది ఉద్యోగాల కోసం వస్తున్నారు”. అంటూ మంత్రి సోవన్ దేవ్ చెప్పుకొచ్చారు. తక్కువ విద్యార్హత ఉన్న వారికి ఆసుపత్రులు, ఇతర కార్యాలయాల్లో చిన్న ఉద్యోగాలు ఇప్పించగలం కాని గ్రాడ్యుయేట్లు, ఎం.ఎ లేదా ఉన్నత డిగ్రీ ఉన్నవారికి మంది ఉద్యోగం అందుబాటులో లేదని మంత్రి అన్నారు.