మాస్కులు లేకుండా దసరా కోసం రోడ్లపైకి వేల సంఖ్యలో జనాలు

మాస్కులు లేకుండా దసరా కోసం రోడ్లపైకి వేల సంఖ్యలో జనాలు

ఆగిఆగి కురుస్తున్న వర్షాలకు భయపడకుండా Durga Poojaకు అంతరాయం లేకుండా ఉండేందుకు పూజా మండపాలు, వ్యాపారాలు నడిచేందుకు గల్లీ దుకాణాలు వెలిశాయి. గత వారం వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. భక్తులు దేవీ దర్శనార్థం చివరి రోజు వరకూ ఆగకుండా మూడు రోజుల ముందునుంచే వెళ్తే రద్దీ జరగకుండా ఆపవచ్చని పిలుపునిచ్చారు.

కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో ఏక్‌దాలియా ఎవర్ గ్రీన్. సింఘీ పార్క్, శ్రీభూమి స్పోర్టింగ్ అండ్ బాదంతలా అసర్ సంఘా లాంటి ప్రాంతాలకు మాస్క్ లు లేకుండా అనుమతులను నిరాకరించారు. మండపాలకు బయట గుంపులను అదుపుచేయడం సవాల్ గానే మారింది. పూజా కమిటీల నుంచి వచ్చే హెచ్చరికలను పట్టించుకోకుండా అదే గుంపులు మెయింటైన్ చేస్తున్నారు. శ్రీభూమి స్పోర్టింగ్ దగ్గర చాలా మంది పలు కార్నర్ల నుంచి ఫొటోగ్రాఫ్స్ క్లిక్ మనిపించేందుకు పోటీపడి గుంపులుగా పోగవుతున్నారు.



సుభం దాస్ అనే మండప నిర్వాహకుడు శ్రీభూమి పాండల్ బయట..’ఈ పూజను కచ్చితంగా చూడాల్సిందే. కొవిడ్ ఉన్నా లేకపోయినా. 8కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి వెనుకే ఉండిపోవడమంటే నా వల్ల కాదు’ అని దమ్ దమ్ అనే ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి చెప్పుకొచ్చాడు.

సౌత్ కోల్‌కతాలోని పార్థ ఘోష్ అనే శివ్ మందిర్ దుర్గా పూజా ఆఫీస్ బేరర్ గా ఉంటున్నాడు. వాలంటీర్లు వచ్చే మార్గం, వెళ్లే మార్గంలో ఉండి మాస్క్ లు తీయకుండా, ఒకరిని ఒకరు తోసుకోకుండా ఉండే జాగ్రత్తలు తీసుకుంటుననారు. ఇంకా పండుగ షాపింగ్ లలో భాగంగా చివరి సమయంలో పరుగులు తీసి రద్దీ పెంచుకుంటున్నారు మరి కొందరు.

రీటా దేవ్‌నాథ్.. అనే మహిళను మాస్క్ ముక్కుకు ఎందుకు ధరించలేదని అడిగితే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవడంతో తీసేశానని చెప్పింది. ‘ఎందుకు నన్నే అడుగుతారు. చాలా మంది ప్రొటోకాల్స్ పాటించడం లేదు. నా పిల్లలకు, మనువళ్లకు షాపింగ్ చేయడానికి ఇదే మాకు సరైన సమయం. సంప్రదాయాన్ని కాదనలేను’ అని ఆమె చెప్పింది.