Actress Swara Bhaskar : చంపేస్తామ‌ని న‌టి స్వ‌ర భాస్క‌ర్‌కు బెదిరింపు లేఖ‌

గుర్తుతెలియ‌ని వ్య‌క్తుల‌ నుంచి త‌న నివాసానికి బెదిరింపు లేఖ రావ‌డంతో వెర్సోవా పోలీస్ స్టేష‌న్‌లో న‌టి స్వ‌ర భాస్క‌ర్ ఫిర్యాదు చేశారు. న‌టి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Actress Swara Bhaskar : చంపేస్తామ‌ని న‌టి స్వ‌ర భాస్క‌ర్‌కు బెదిరింపు లేఖ‌

Actress Swara Bhaskar : బాలీవుడ్ హీరో స‌ల్మాన్ ఖాన్ కు ఇటీవలే బెదిరింపు లేఖ రాసిన విషయం తెలిసిందే. తాజాగా న‌టి స్వ‌ర భాస్క‌ర్‌కు కూడా బెదిరింపు లేఖ వ‌చ్చింది. స్వ‌ర భాస్క‌ర్‌ను చంపేస్తామ‌ని అజ్ఞాత వ్య‌క్తి నుంచి ఆమె నివాసానికి స్పీడ్ పోస్ట్ ద్వారా లేఖ అందింది. ముంబైలోని వెర్సోవాలో న‌టి నివాసానికి ఈ లేఖ‌ను పంపారు. స్వ‌ర భాస్క‌ర్‌కు బెదిరింపు లేఖ రావ‌డంపై ముంబై పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

గుర్తుతెలియ‌ని వ్య‌క్తుల‌ నుంచి త‌న నివాసానికి బెదిరింపు లేఖ రావ‌డంతో వెర్సోవా పోలీస్ స్టేష‌న్‌లో న‌టి స్వ‌ర భాస్క‌ర్ ఫిర్యాదు చేశారు. న‌టి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. హిందీలో రాసిన ఈ లేఖ‌లో స్వ‌ర భాస్క‌ర్‌కు ప్రాణ హాని త‌ల‌పెడతామ‌ని అంటూ అస‌భ్య ప‌ద‌జాలంతో దూషించార‌ని పోలీసులు పేర్కొన్నారు. లేఖ చివ‌రిలో ఇట్లు ఈ దేశ యువ‌కులు అని రాసి ఉంద‌ని వెల్లడించారు.

Salman Khan Threat Letter : బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ను చంపేస్తామంటూ బెదిరింపులు
వీర్ సావ‌ర్క‌ర్‌ను అవమానిస్తే దేశ యువ‌త చూస్తూ ఊరుకోద‌ని లేఖ‌లో హెచ్చరించారు. స‌మాజంలో జ‌రిగే సామాజిక రాజ‌కీయ అంశాల‌పై స్వ‌ర భాస్క‌ర్ చురుకుగా స్పందిస్తుంటారు. జైలు నుంచి విడిచిపెట్టాల‌ని వేడుకుంటూ సావ‌ర్క‌ర్ బ్రిటిష్ ప్ర‌భుత్వానికి క్ష‌మాప‌ణ‌లు చెప్పార‌ని.. ఆయ‌న వీరుడు ఎంత‌మాత్రం కాద‌ని 2017లో స్వ‌ర భాస్క‌ర్ చేసిన ట్వీట్ దుమారం రేపింది.