Union Minister Nitin Gadkari : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపు కాల్స్.. చంపుతామని హెచ్చరికలు

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని హతమార్చుతామని గుర్తు తెలియని వ్యక్తులు నాగపూర్‌లోని గడ్కరీ కార్యాలయంలో ల్యాండ్‌ఫోన్‌కు ఫోన్‌చేసి బెదిరించాడు. మూడు సార్లు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చినట్లు కార్యాలయ సిబ్బంది వెల్లడించారు. ఉదయం 11.29 గంటలకు, 11:35 గంటలకు, మధ్యాహ్నం 12. 32 గంటలకు ఈ బెదిరింపు ఫోన్‌కాల్స్ వచ్చాయి.

Union Minister Nitin Gadkari : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపు కాల్స్.. చంపుతామని హెచ్చరికలు

Nitin Gadkari

Union Minister Nitin Gadkari : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. నాగ్‌పూర్‌లోని కార్యాలయంలో ల్యాండ్ లైన్ కు ఫోన్ చేసిన గుర్తుతెలియని వ్యక్తులు చంపుతామని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఆందోళన చెందిన నితిన్ గడ్కరీ కార్యాలయం సిబ్బంది నాగ్‌పూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు సార్లు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చినట్లు కార్యాలయ సిబ్బంది వెల్లడించారు. ఉదయం 11.29 గంటలకు, 11:35 గంటలకు, మధ్యాహ్నం 12. 32 గంటలకు ఈ బెదిరింపు ఫోన్‌కాల్స్ వచ్చాయి.

Nitin Gadkari: 2024 నాటికి అమెరికాతో సమానంగా భారత్.. కేంద్ర మంత్రి గడ్కరి

గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపుకాల్ చేసిన సమయంలో దావూద్ (దావూద్ ఇబ్రహీంను సూచిస్తూ) పేరును పేర్కొన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందినవెంటనే పోలీసులు, ఉన్నతాధికారులు గడ్కరీ కార్యాలయానికి చేరుకొని విచారణ చేపట్టారు. గడ్కరీ ప్రస్తుతం నాగపూర్ లోనే ఉన్నారని, ఆయన క్షేమంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. కేంద్ర మంత్రి క్యాంప్ కార్యాలయం నాగపూర్‌లోని ఖమ్లా‌చౌక్‌లో ఉంది. ఈ కార్యాలయం గడ్కరీ నివాసానికి ఒక కిలో మీటరు దూరం ఉంటుంది.

 

పోలీసులతో పాటు ఏటీఎస్ బృందం గడ్కరీ కార్యాలయానికి చేరుకొని, కార్యాలయ సిబ్బందినుంచి పలు విషయాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఎవరైనా ఆకతాయిలు ఫోన్ చేశారా? లేక దీని వెనుక ఏమైనా కుట్రకోణం ఉందా అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.