Ankita Bhandari: అంకిత భండారి హత్య కేసు.. ముగ్గురు నిందితులకు నార్కో పరీక్ష

సంచలనం సృష్టించిన అంకిత భండారి హత్య కేసు నిందితులకు పోలీసులు నార్కో టెస్ట్ నిర్వహించబోతున్నారు. రిసార్టులో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న అంకితను యజమాని, మరో ఇద్దరితో కలిసి హత్య చేసిన సంగతి తెలిసిందే.

Ankita Bhandari: అంకిత భండారి హత్య కేసు.. ముగ్గురు నిందితులకు నార్కో పరీక్ష

Ankita Bhandari: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరాఖండ్, రిసార్ట్ రిసెప్షనిస్ట్ అంకిత భండారి హత్య కేసు విచారణ కొనసాగుతోంది. ఉత్తరాఖండ్‌లోని ఒక రిసార్ట్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తన్న అంకిత భండారిని యజమాని, మేనేజర్, సిబ్బంది కలిసి వ్యభిచారంలోకి దింపాలని ప్రయత్నించారు.

India vs Bangladesh: బంగ్లాదే‌శ్‌ సిరీస్.. నేడే భారత తొలి వన్డే.. ఉదయం 11.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం

దీనికి ఆమె నిరాకరిచింది. దీంతో వాళ్లు ఆమెను స్థానికంగా ఉన్న ఒక కాలువ వద్దకు తీసుకెళ్లి హత్య చేశారు. తర్వాత ఆమె మృతదేహం బయటపడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు రిసార్ట్ యజమాని పుల్కిత్ ఆర్యను ప్రధాన నిందితుడిగా గుర్తించారు. అలాగే ఈ హత్యలో రిసార్ట్ మేనేజర్ సహా మరొకరి పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తర్వాత ముగ్గురు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రధాన నిందితుడు పుల్కిత్ ఆర్య స్థానిక బీజేపీ నేత కుమారుడు. గత సెప్టెంబర్ 18న అంకితను హత్య చేయగా, ఆమె మృతదేహం అదే నెల 24న బయటపడింది.

Delhi civic polls: నేఢే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు.. 250 స్థానాలకు పోటీ.. పింక్ పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు

ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. కేసుకు సంబంధించి పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. అయితే, మరింత బలమైన ఆధారాలు సేకరించే ఉద్దేశంతో పోలీసులు నిందితులకు నార్కో టెస్ట్ నిర్వహించాలనుకున్నారు. దీని కోసం ఇప్పటికే కోర్టుకు దరఖాస్తు చేశారు. కోర్టు అనుమతి రాగానే నిందితులకు నార్కో పరీక్ష నిర్వహిస్తారు.