Rajasthan : ముగ్గురు మంత్రులు రాజీనామా

రెండురోజుల్లో అశోక్ గెహ్లాట్ ప్ర‌భుత్వం క్యాబినెట్‌ను పున‌ర్‌వ్య‌వ‌స్థీక‌రించ‌నున్న‌ తరుణంలో ముగ్గురు మంత్రులు తమ రాజీనామా లేఖలను పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమర్పించారు.

Rajasthan : ముగ్గురు మంత్రులు రాజీనామా

Rajasthan

Rajasthan : రాజస్థాన్‌లో ముగ్గురు మంత్రులు రాజీనామా చేశారు. రెండురోజుల్లో అశోక్ గెహ్లాట్ ప్ర‌భుత్వం క్యాబినెట్‌ను పున‌ర్‌వ్య‌వ‌స్థీక‌రించ‌నున్న‌ తరుణంలో ముగ్గురు మంత్రులు తమ రాజీనామా లేఖలను కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమర్పించారు. రాజీనామా చేసిన వారిలో రెవ‌న్యూశాఖ మంత్రి హ‌రీశ్ చౌద‌రీ, వైద్య‌శాఖ మంత్రి ర‌ఘు శ‌ర్మ‌, విద్యాశాఖ మంత్రి గోవింద్ సింగ్ దోస్తారాలు ఉన్నారు. క్యాబినెట్‌లో వీరు కీలకంగా వ్యవహరిస్తున్నారు.

చదవండి : Rajasthan : పరీక్షకు హాజరైన యువతి స్లీవ్‌లు కత్తిరించిన సెక్యూరిటీ గార్డు..మండిపడ్డ మహిళా కమిషన్

మంత్రిపదవులకు రాజీనామా చేసినా పార్టీతో పనిచేసేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ తెలిపారు. కాగా వీరు ముగ్గురు కాంగ్రెస్ పార్టీలో కీలక వ్యక్తుల్లో.. రాజీనామా చేసిన వారిలో దోస్తారా రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉండగా.. రఘు శర్మ గుజరాత్ ఇంచార్జీగా ఉన్నారు.. మరోమంత్రి హరీష్ చౌదరీ పంజాబ్ ఇంచార్జీగా కొనసాగుతున్నారు. 200 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఆ రాష్ట్రంలో 21 మంది మంత్రులు ఉన్నారు. అత్య‌ధికంగా 30 మంత్రులు ఉండే అవ‌కాశం ఉన్న‌ది.

చదవండి : Rajasthan Cabinet : ఢిల్లీ వేదికగా రాజస్తాన్ పంచాయతీ.. సోనియాతో సచిన్ పైలట్ భేటీ!