కరోనా వ్యాక్సిన్ పై మోడీ కీలక ప్రకటన

  • Published By: madhu ,Published On : August 15, 2020 / 10:28 AM IST
కరోనా వ్యాక్సిన్ పై మోడీ కీలక ప్రకటన

కరోనా వ్యాక్సిన్ పై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు. Indian coronavirus vaccines  మూడు పరీక్ష దశలో ఉన్నాయని, సైంటిస్టులు గ్రీన్ సిగ్నల్ ఇస్తే..పెద్ద ఎత్తున ఉత్పత్తి ప్రారంభిస్తామని ప్రకటించారు. ప్రపంచంలో భారత్ ఎవరికన్నా తక్కువ కాదని, ఉత్తమ ఉత్పత్తుల దేశంగా భారత్ ఉందని వెల్లడించారు.



74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కరోనా టీకాలను ప్రతి భారతీయుడికి అందే విధంగా కార్యాచరణను రూపొందించినట్లు, జాతీయ డిజిటల్ హెల్త్ మిషన్ ను త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపారు.
కరోనా మహమ్మారి ఎన్నో కష్టాలను తెచ్చిపెట్టిందని, ఈ విపత్కర సమయంలో పనిచేస్తున్న వైద్యులకు ప్రణామాలు చేస్తున్నట్లు వెల్లడించారు.



నర్సులు, అంబులెన్స్ డ్రైవర్లు ఎంతో కృషిచేస్తున్నారని కొనియాడారు. ఈ వైరస్ ఒక్కటే కాకుండా..దేశంలో వరదలు, ప్రకృతి విపత్తులు సంభవించాయని గుర్తు చేశారు. కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు ఏకతాటిపైకి వచ్చి ఎదుర్కొంటున్నాయని అన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్నామని ప్రధాని పేర్కొన్నారు.



దేశంలో తయారయ్యే ఉత్పత్తుకు తగిన మార్కెట్ ను మనమే సృష్టించుకోవాలన్నారు. హెల్త్ కు సంబంధించిన విషయంలో ప్రతొక్కరికీ ఐడీలు ఇవ్వనున్నామని, వైద్యుడు, ఫార్మాసికి వెళితే..వారికి సంబంధించిన హెల్త్ ప్రొఫైల్ మొత్తం ఉంటుందన్నారు. చారిత్రక ఎర్రకోట నుంచి మోడీ ప్రసంగించడం వరుసగా ఇది ఏడోసారి.