Uttar Pradesh : ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం.. చీమలు కరవడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న శిశువు మృతి

శిశువు అనారోగ్యంగా ఉండటంతో వైద్యులు నియోనటల్‌ ఇన్‌టెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో (NICU)లో ఉంచారు. అయితే శిశువును చీమలు కరవడంతో జూన్‌ 2న మృతి చెందింది.

Uttar Pradesh : ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం.. చీమలు కరవడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న శిశువు మృతి

Baby Died

Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. చీమలు కరవడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న మూడు రోజుల శిశువు మృతి చెందింది. యూపీలోని మహోబా జిల్లా ముధారికి చెందిన సీమా, సురేంద్ర రైక్వార్ భార్యాభర్తలు. నిండు గర్భిణీ సీమా.. ప్రసవం కోసం మహోబా జిల్లా కేంద్రం ఆస్పత్రిలో చేరింది. మే 30న ఆమె బిడ్డకు జన్మనిచ్చింది.

శిశువు అనారోగ్యంగా ఉండటంతో వైద్యులు నియోనటల్‌ ఇన్‌టెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో (NICU)లో ఉంచారు. అయితే శిశువును చీమలు కరవడంతో జూన్‌ 2న మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన శిశువు కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందిందని ఆరోపించారు.

Jharkhand: పాపం పసికందు.. వైద్యుల నిర్లక్ష్యం.. పసికందు కాళ్లను కొరుక్కుతిన్న ఎలుకలు

ఈ ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ దర్యాప్తుకు ఆదేశించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇదిలావుంటే, శిశువుకు చికిత్స అందించడానికి వైద్యులు తమ దగ్గరి నుంచి రూ.6500 లంచం తీసుకున్నట్లు బాధితులు తెలిపారు.