Road Accident : పాదచారులను మెరుపువేగంతో ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి

మొహాలిలోని చండిగఢ్‌ యూనివర్సిటీ వద్ద హాలీవుడ్‌ యాక్షన్ సీన్‌ను తలపించే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం ముగ్గురు మృతి చెందారు.

Road Accident : పాదచారులను మెరుపువేగంతో ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి

Accident (1)

Three killed in road accident : మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. కానీ రోడ్డు దాటుదామనుకున్న ఆ ఇద్దరు డ్రైవర్లకు మృత్యువు మాత్రం అతి వేగంగా వస్తున్న కారు రూపంలో వచ్చింది. కళ్లు మూసి తెరిచేలోగా వారి జీవితాలను చీధ్రం చేసింది. ఈ దారుణ ఘటన మొహాలిలో జరిగింది. హాలీవుడ్‌ యాక్షన్ సీన్‌ను తలపించిన ఈ రోడ్డు ప్రమాదం చూస్తుంటేనే ఒళ్లు గగుర్పోడుస్తుంది. మొహాలిలోని చండిగఢ్‌ యూనివర్సిటీ వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరిని ఆటో డ్రైవర్లుగా గుర్తించిన పోలీసులు.. మరొకరిని కారులో ప్రయాణిస్తున్న యువకుడిగా గుర్తించారు.

అతి వేగంగా దూసుకొచ్చిన కారు ఆ ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టడానికి ముందే అదుపు తప్పింది. అప్పటికే రోడ్డుపై బీభత్సం సృష్టిస్తున్న కారును చూసిన ఆ ఇద్దరు ఆటో డ్రైవర్లు వెనక్కి వెళ్లేందుకు పరుగందుకున్నారు. కానీ అతి వేగంగా వచ్చిన కారు ఫుట్‌పాత్‌ను ఎక్కి వారిని ఢీకొట్టింది. దీంతో వారు గాల్లో బంతుల్లా ఎగిరి పడ్డారు. కారు ఢీకొట్టడంతో ఇద్దరు ఆటో డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు.

VRO Suicide : కాల్ మనీ వేధింపులు తాళలేక వీఆర్వో ఆత్మహత్య

రోడ్డుకు అవతలివైపు బైక్‌పై ఉన్న వ్యక్తి కూడా కింద పడిపోయాడు అంటే ఆ కారు ఎంత వేగంగా వస్తుందో ఊహించుకోవచ్చు. కారు ఎలక్ట్రీక్‌ పోల్‌ను ఢీకొట్టి ఆగిపోయింది. ప్రమాద సమయంలో కారులో ఐదురుగు వ్యక్తులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. వారంతా మద్యం సేవించి ఉన్నారని స్థానికులు తెలిపారు. కారులో ఉన్న ఐదుగురు యువకులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు.

ప్రమాద తీవ్రతకు కారు ఒకవైపు భాగం మొత్తం దెబ్బతింది. ప్రమాదం అనంతరం సీసీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు కారు వేగానికి షాక్‌ అయ్యారు. కారును కంట్రోల్‌ చేసే క్రమంలో అదుపు తప్పిందని.. అదే ముగ్గురి మృతికి కారణమని నిర్ధారణకు వచ్చారు. ప్రమాద సమయంలో కారు నడిపింది అంకుశ్‌ కుమార్‌గా గుర్తించారు.