Jawans Death : పండగ పూట విషాదం.. కరెంట్ షాక్‌తో ముగ్గురు జవాన్లు మృతి, నలుగురి పరిస్థితి విషమం

పండగ పూట బీహార్ లో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్ తో ముగ్గురు ట్రైనీ జవాన్లు మృతి చెందారు.

Jawans Death : పండగ పూట విషాదం.. కరెంట్ షాక్‌తో ముగ్గురు జవాన్లు మృతి, నలుగురి పరిస్థితి విషమం

Jawans Death

Jawans Death : పండగ పూట బీహార్ లో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్ తో ముగ్గురు ట్రైనీ జవాన్లు మృతి చెందారు. సుపౌల్ ప్రాంతంలో బీర్పూర్ క్యాంపులో ఈ ఘటన జరిగింది. హైవోల్టేజ్ కరెంట్ వైర్లు తగిలి ముగ్గురు జవాన్లు మరణించారు. మరో 9మంది గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. సశస్త్ర సీమాబల్ 45బీ బెటాలియన్ కు చెందిన జవాన్లు టెంట్లు తీసి వేస్తుండగా ఈ ఘోరం జరిగింది. ఇక్కడ జవాన్లకు శిక్షణ జరుగుతోంది.

Omicron-Cyber attack: బీ కేర్ ఫుల్.. ఒమిక్రాన్‌నూ వదలని సైబర్ చీటర్లు.. క్లిక్ చేస్తే మొత్తం దోచేస్తారు..!

అక్కడికక్కడే మృతి..
మరణించిన వారిలో మహారాష్ట్రకు చెందిన అతుల్ పాటిల్ (30), పరశురామ్ సబర్ (24), మహేంద్ర చంద్ర కుమార్ బోప్చే (28) ఉన్నారు. ఈ ముగ్గురు స్పాట్ లోనే చనిపోయారు. గాయపడిన జవాన్లు నర్సింగ్ చౌహాన్, చంద్రశేఖర్, పరితోష్ అధికారి, మాండ్వే రాజేంద్ర, మహ్మద్ శంషాద్, సుకుమార్ వర్మ, సోనా లాల్ యాదవ్, ఆనంద్ కిషోర్‌లను సబ్ డివిజనల్ ఆసుపత్రికి తరలించారు.

Online Shopping : షాకింగ్.. రూ.16వేల ఫోన్ ఆర్డర్ చేస్తే.. అరకిలో రాయి వచ్చింది

బీర్పూర్ క్యాంపులో జవాన్లకు శిక్షణ కార్యక్రమం ముగిసింది. దీంతో వారు టెంట్లు తీసి వేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలో టెంట్‌లోని పైప్‌కు.. పైనుంచి వెళ్తున్న హైవోల్టేజీ వైరు తాకడంతో టెంట్‌ అంతా కరెంట్‌ పాకింది. కరెంట్ షాక్ కొట్టడంతో జవాన్లు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనతో క్యాంపులో విషాదం అలుముకుంది. కాగా, శిక్షణా కేంద్రం పైనుంచి వెళ్తున్న హైటెన్షన్‌ వైరును తొలగించాలని జవాన్లు అనేకసార్లు విద్యుత్‌ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా వారు తొలగించలేదు. దీంతో ఘోరం జరిగిపోయింది.