భూవివాదంలో గిరిజనులను వేటాడి చావబాదిన అగ్ర కులస్థులు

  • Published By: Subhan ,Published On : May 16, 2020 / 12:03 PM IST
భూవివాదంలో గిరిజనులను వేటాడి చావబాదిన అగ్ర కులస్థులు

అగ్రకులాలకు చెందిన వ్యక్తులు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గిరిజనులపై గొడవకు దిగారు. ఓ  స్థల వివాదంలో మొదలైన గొడవలో గిరిజనులను చావబాదారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో కేజ్ తహసీల్ కు చెందిన వ్యక్తులు బుధవారం ఈ వాదనకు దిగారు. బాధితులు బాబూ పవార్, సంజయ్, ప్రకాశ్ లు గా పేర్కొన్నారు. 

నిందితులు నింబాల్కర్ క్లాన్, హార్ష్ పొద్దార్ కుటుంబాలకు చెందిన వారిగా ఎస్పీ పేర్కొన్నారు. గిరిజన కుటుంబానికి చెందినన 20మంది వ్యక్తుల రాత్రి 11గంటల సమయంలో పొలాల వద్దకు వెళ్లారు. అదే సమయంలో నింబాల్కర్ కుటుంబానికి చెందిన వ్యక్తులు వచ్చారు. ఘటనాస్థలానికి చేరుకోగానే బాబూ, సంజయ్, ప్రకాశ్ లను తోసేసింది నింబాల్కర్ కుటుంబం. 

పారిపోయేందుకు ప్రయత్నించిన గిరిజనులను పట్టుకుని చితకబాదింది  నింబాల్కర్ ఫ్యామిలీ. ఘటనాస్థలానికి నాకాబండి పోలీసులు చేరుకునేంత వరకూ గొడవ జరుగుతూనే ఉంది. ఆ సమయంలోనే ఒకరు చనిపోయినట్లుగా గుర్తించారు. పోలీస్ కంట్రోల్ రూంకు సమాచారం ఇవ్వడంతో సీనియర్ పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి నింబాల్కర్ కుటుంబానికి చెందిన 17మందిని అరెస్టు చేశారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండు కుటుంబాలకు 2006 నుంచి వ్యవసాయ భూమి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. దీనిపై 2006లో నింబాల్కర్స్ కుటుంబంపై కేసు కూడా నమోదైంది. అయినా 2012లో వారిని నిర్దోషిగా ప్రకటించారు.

Read Here>> Twitter లో కొత్త జీవిని కనుగొన్నారు..పేరు ఏంటో తెలుసా