President Election 2022: రాష్ట్రపతి ఎన్నికల్లో త్రిముఖ పోరు? కేసీఆర్ వ్యూహం ఫలిస్తుందా..

రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి అభ్యర్థుల ఎంపికపై ఆయా పార్టీలు తలమునకలయ్యాయి. ముఖ్యంగా రెండు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ తమ మద్దతుదారులను రాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. ఈ క్రమంలో దేశ రాజకీయాల్లో చక్రంతిప్పేందుకు వేగంగా అడుగులు వేస్తున్న సీఎం కేసీఆర్ బీజేపీ, కాంగ్రెసేతర అభ్యర్థిని రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దింపేందుకు......

President Election 2022: రాష్ట్రపతి ఎన్నికల్లో త్రిముఖ పోరు? కేసీఆర్ వ్యూహం ఫలిస్తుందా..

Cm Kcr

President Election 2022: రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి అభ్యర్థుల ఎంపికపై ఆయా పార్టీలు తలమునకలయ్యాయి. ముఖ్యంగా రెండు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ తమ మద్దతుదారులను రాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టడంతోపాటు అందరికి ఆమోదయోగ్యమైన అభ్యర్థికోసం ఆ రెండు పార్టీలు వెతుకులాట ప్రారంభించాయి. ఈ క్రమంలో దేశ రాజకీయాల్లో చక్రంతిప్పేందుకు వేగంగా అడుగులు వేస్తున్న సీఎం కేసీఆర్ బీజేపీ, కాంగ్రెసేతర అభ్యర్థిని రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దింపేందుకు కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరుతో పార్టీని ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ నిర్ణయించారు. ఈ క్రమంలో రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఉండే అవకాశాలున్నాయి. ఇదివరకే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే, ఎన్‌సీపీ నేత శరద్ పవార్, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, మాజీ ప్రధాని దేవెగౌడ సహా పలువురు నేతలతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. సామాజిక వేత్త అన్నా హజారే, మాజీ ప్రధాని దేవెగౌడ సహా కీలక వ్యక్తులను రాష్ట్రపతి అభ్యర్థిగా తెరమీదికి తెచ్చి బీజేపీ, కాంగ్రేసేతర పార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్రపతి ఎన్నికల్లో త్రిముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది.

CM KCR: త్వరలో సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ..? నెలాఖరులో ఢిల్లీలో ప్రకటించే ఛాన్స్..

రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రపతి అభ్యర్థిగా ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తిని ఎంపిక చేసేందుకు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. కేరళ గవర్నర్‌ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ లాంటి మైనార్టీ నేతను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించవచ్చనే చర్చ సాగుతోంది. నూపుర్ శర్మ వివాదం తర్వాత గల్ఫ్ దేశాలతో భాజపా సంబంధాలు చెడిపోవడంతో ఈ చర్చకూడా బలపడుతోంది. అంతేకాక ఎన్డీఏ అభ్యర్థిగా గులాంనబీ ఆజాద్, కర్ణాటక గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌, అసోం గవర్నర్‌ జగ్దీశ్‌ ముఖి, జార్ఖండ్‌ మాజీ గవర్నర్‌ ద్రౌపది ముర్ము, ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌ అనసూయ యూకీ, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌, కేంద్ర మాజీ మంత్రి జుయల్‌ ఓరమ్‌, లోక్‌సభ మాజీ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్లను ఆ పార్టీ నేతలు పరిశీలిస్తున్నారు.

CM KCR : రాష్ట్రపతి ఎన్నికలపై సీఎం కేసీఆర్ కీలక సమావేశం

మరోవైపు వచ్చే ఏడాది గుజరాత్‌తో పాటు మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్‌లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపద్యంలో ఆదివాసీ అభ్యర్ధిపై బీజేపీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. గుజరాత్‌లో 15శాతం, మధ్యప్రదేశ్‌లో 21శాతం, చత్తీస్‌గఢ్‌లో 30శాతం, రాజస్థాన్‌లో 13.5శాతం ఆదివాసీలు ఉన్నారు. భారత్‌లోని మొత్తం ఆదివాసీల జనాభాలో ఐదు రాష్ట్రాలోనే సుమారు 40శాతం ఆదివాసీలు నివసిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివాసి వర్గానికి చెందిన వ్యక్తిని రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికచేస్తే ఈ ఐదు రాష్ట్రాల్లో ఆదివాసీ ఓట్లను తమ ఖాతాలో వేసుకోవచ్చన్నది బీజేపీ మరో ప్లాన్ గా కనిపిస్తోంది. అయితే రాష్ట్రపతి ఎన్నిక గెలుపు కోసం టీఆర్ఎస్, వైసిపి, బీజేడీ పార్టీల ఎంపీ, ఎమ్మెల్యే ఓట్లు కీలకంగా మారబోతున్నాయి. ఇప్పటికే వైసీపీ, బీజేడీ పార్టీలు బీజేపీ బరిలో నిలిపే అభ్యర్థికి మద్దతు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.

Minister KTR: నేడు ఖమ్మం జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన.. షెడ్యూల్ ఇలా..

మరోవైపు రాష్ట్రపతి ఎన్నికను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్డీయే యేతర పార్టీలతో కలిసి రాష్ట్రపతి అభ్యర్థి రేసులో ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరా కుమార్‌లను బరిలోకి దింపేలా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పావులు కదుపుతున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థి గురించి సీతారాం ఏచూరి, శరద్ పవార్, స్టాలిన్, మమతతో సోనియా గాంధీ ఫోన్లో మాట్లాడారు. ముంబైలో శరద్ పవర్ ను కలిసిన మల్లిఖార్జున ఖర్గే, త్వరలో ఉద్దవ్ ఠాక్రే, స్టాలిన్, మమత బెనర్జీని కలవనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ యేతర వ్యక్తిని ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్దిగా ఎంపిక చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మరోవైపు వైసిపి, టీఆర్ఎస్, బీజేడీ పార్టీలతోనూ మల్లికార్జున ఖర్గే సంప్రదింపులు జరుపుతారని సమాచారం.