Delisha Davis : ఆయిల్ ట్యాంకరు డ్రైవర్ గా 24ఏళ్ల అమ్మాయి

చాలామంది అమ్మాయిలు టూ వీలర్ నడపాలంటేనే హడలిపోతారు. కానీ ఎంతోమంది అమ్మాయిలు పెద్ద పెద్ద కంటైనర్ లనే నడిపేస్తున్నారు. బస్సులు నడిపేస్తున్నారు. పెద్ద పెద్ద వాహనాలకు కేవలం మగవారే కాదు మేం కూడా నడిపుతామని నిరూపిస్తున్నారు. అటువంటి ఓ అమ్మాయి ఆయల్ ట్యాంకర్ ను నడుపుతోంది. 24 ఏళ్ల వయస్సులో ఉన్న ఓ అమ్మాయి ఏకంగా 300ల కిలోమీటర్ల దూరం అలుపు సొలుపు లేకుండా ఆయిల్ ట్యాంకర్ ను నడుపుతూ గమ్యానికి చేరుస్తోంది.

Delisha Davis : ఆయిల్ ట్యాంకరు డ్రైవర్ గా 24ఏళ్ల అమ్మాయి

Delisha Davis (1)

Delisha Davis drives petrol tanker : చాలామంది అమ్మాయిలు టూ వీలర్ నడపాలంటేనే హడలిపోతారు. కానీ ఎంతోమంది అమ్మాయిలు పెద్ద పెద్ద కంటైనర్ లనే నడిపేస్తున్నారు. బస్సులు నడిపేస్తున్నారు. పెద్ద పెద్ద వాహనాలకు కేవలం మగవారే కాదు మేం కూడా నడిపుతామని నిరూపిస్తున్నారు. అటువంటి ఓ అమ్మాయి ఆయల్ ట్యాంకర్ ను నడుపుతోంది. 24 ఏళ్ల వయస్సులో ఉన్న ఓ అమ్మాయి ఏకంగా 300ల కిలోమీటర్ల దూరం అలుపు సొలుపు లేకుండా ఆయిల్ ట్యాంకర్ ను నడుపుతూ గమ్యానికి చేర్చింది.

ఆ అమ్మాయి పేరు దెలిషా డేవిస్..చదివింది ఎంకామ్. కానీ డిఫరెంట్ వృత్తిని చేపట్టి..లారీ డ్రైవింగ్ సెలక్ట్ చేసుకుంది. దెలిషా డేవిస్ దికేరళలోని త్రిసూర్. నేటితరం తరం అమ్మాయిలకు నిలువెత్తు ప్రతినిధిలా కనిపిస్తుంది 24 ఏళ్ల దెలిషా. ఆమెకు డ్రైవింగ్ అంటే ప్రాణం.దెలిషా తండ్రి పేరు డేవిస్. అతను లారీ డ్రైవర్. దీంతో దెలిషాకు చిన్నప్పటినుంచి లారీ నడపాలనే కోరిక పెరుగుతూ వచ్చింది. డేవిస్ కూడా కూతురు కోరికను వద్దనలేదు. ఎంతో ధైర్యంతో లారీ డ్రైవింగ్ నేర్చుకుంటాను నాన్నా..అని అడిగితే కాదనలేదు. ఆడపిల్లవి నీకెందుక లారీ డ్రైవింగ్ అని అనలేదు. కూతరుని ప్రోత్సహించారు. అలా లారీ డ్రైవింగ్ నేర్పించాడు. చాలా త్వరగానే నేర్చేసుకుంది దెలిషా.

అలా చదివింది ఎంకామ్ అయినా లారీ డ్రైవింగ్ నే వృత్తిగా సెలక్ట్ చేసుకుంది. అది తెలిసిన ఎంతోమంది ‘‘ఆడపిల్లవు..లారీ డ్రైవర్ అంటే వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. రాత్రి సమయాల్లో కూడా డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది చాలా కష్టం..చక్కగా ఎంకామ్ చదువుకున్నావు..చక్కటి ఉద్యోగం చేసుకోకుండా ఈ లారీ డ్రైవింగ్ ఏంటీ’’అన్నారు. కానీ దెలిషా ఏమీ భయపడలేదు. అలా చక్కగా డ్రైవింగ్ నేర్చుకున్న దెలిషా డ్రైవింగ్ లైసెన్స్ కూడా తెచ్చుకుంది.
డ్రైవింగ్ ని వృత్తిగా చేసుకున్న ఈ కేరళ యువతి పెట్రోల్ ట్యాంకర్ డ్రైవర్ గా పనిచేస్తోంది. అలా వారానికి మూడుసార్లు ఓ పెట్రోల్ ట్యాంకరును కొచ్చి నుంచి మళప్పురం వరకు వెళ్లి.. తిరిగొస్తుంది. ఇరుంబనం వద్ద ఉన్న ఆయిల్ రిఫైనరీ నుంచి చమురును తిరూర్ లోని ఓ పెట్రోల్ బంకుకు ట్యాంకరు ద్వారా తరలించడం అంటే దెలిషాకు ఎంతో ఇష్టం. గత మూడేళ్లుగా దెలిషా కేరళ రోడ్లపై తన ఆయిల్ ట్యాంకరు లారీని పరుగులు పెట్టిస్తోంది.

ఈక్రమంలో ఆయిల్ ట్యాంకర్ లోడుతో వెళుతుండగా తనిఖీలు కోసం రవాణా శాఖ అధికారులు ఆమె వాహనాన్ని ఆపారు. అలా డ్రైవింగ్ సీట్లో ఓ అమ్మాయిని చూసిన వాళ్లు షాక్ అయ్యారు. నిజంగా నువ్వేనా డ్రైవ్ చేసేది అని అడిగారు.దానికి దెలిషా అవును సార్ నేనే అని చెప్పేసరికి వాళ్లు నోరెళ్లబెట్టారు. చిన్న అమ్మాయివి నువ్వు ఆయిల్ ట్యాంకరు లారీ వంటి ప్రమాదకర వాహనాన్ని నడుపుతున్నావు..పేపర్లు చూపించు అన్నారు.దానికి దెలిషా తన డ్రైవింగ్ లైసెన్స్ (హెవీ వెహికిల్ లైసెన్స్), ప్రమాదకర వస్తువులు రవాణా చేసే లైసెన్స్ తో పాటు ఇతర పర్మిషన్ పేపర్లు చూసి షాక్ అయ్యారు. ఆ పేపర్స్ అన్నీ కరెక్ట్ గా ఉండటంతో ‘‘భలే అమ్మాయివే కాదు సూపర్ యంగ్ ఉమెన్ వి’అంటూ అభినందించారు.

తండ్రి దగ్గర లారీ డ్రైవింగ్ నేర్చుకున్న దెలిషా 16 ఏళ్ల వయసులోనే లారీ నడిపిందంటే ఆమె సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఏదో పెద్ద పెద్ద వాహనాలన్ని నడిపేస్తున్నాను కదా..ఇది చాలు అని అనుకోలేదు ఈ చిచ్చరపుడుగు..‘‘మల్టీయాక్సిల్ వోల్వో బస్సు నడపాలని’ దెలిషా కల. నడపటం అంటే నడిపేస్తుంది కానీ దానికి ప్రత్యేక లైసెన్స్ కావాలికదా..అందుకే దెలిషా స్పెషల్ లైసెన్స్ కోసం ట్రైచేస్తున్నానని చెప్పింది.

దీనిపై దెలిషా మాట్లాడుతూ..నేను ఈ రోజు ఆయిల్ ట్యాంకర్ నడుపుతున్నానంటూ దానికి నా తండ్రి ప్రోత్సాహమే. అందరిలా మా నాన్నకూడా నీకెందుకు ఆడపిల్లవు లారీ డ్రైవింగ్ అని అనలేదు. నేను అనటమే హ్యాపీ అన్నట్లుగా నేర్పించారని దీనికి కారణం మా నాన్నే అంటోంది. అలాగే చదువు నిర్లక్ష్యం చేయకుండా నేర్చుకుంటానని అంటేనే నేర్పుతానని అటు చదువు..ఇటు డ్రైవింగ్ విషయంలో మా నాన్న ప్రోత్సహమే నంటోంది. అలా ఈవినింగ్ క్లాసులకు హాజరై ఎంకామ్ పరీక్షలు రాశానని..చెబుతోంది దెలిషా.