టూరిస్టుల బస్సును వెంబడించిన పులి…దడపుట్టించే వీడియో

  • Published By: venkaiahnaidu ,Published On : February 17, 2020 / 10:38 AM IST
టూరిస్టుల బస్సును వెంబడించిన పులి…దడపుట్టించే వీడియో

జంగిల్ సఫారీకి వెళ్లిన టూరిస్టులకు ఒక్కసారిగా వెన్నులో వణుకు పుట్టించింది ఓ పులి. పులి దెబ్బకు కొద్ది సేపు టూరిస్టులు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని, ఎప్పుడు పులి పక్కకు పోతుందా అన్న భయంతో గడిపారు. చివరకు ఈ ఘటన ఇద్దరు అధికారులపై వేటు పడేలా చేసింది.

చత్తీస్ ఘడ్ రాజధాని రాయ్ పూర్ లోని నందన్ వన్  జంగిల్ లో సఫారీ కోసం కొందరు టూరిస్టులు బస్సులో వెళ్లారు. అయితే ఆ సమయంలో రెండు పులులు పోట్లాడుకుంటుండగా వాటి పక్కగా బస్సు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా అందులోని ఒక పులి బస్సును వెంబడించింది. బస్సు కిటీకి ఉన్న కర్టన్ ను గట్టిగా పట్టుకుంది. ఆ పులి బస్సుపై ఎటాక్ చేసేందుకు ప్రయత్నించడంతో స్పీడు తగ్గించమని ఓ టూరిస్టు బస్సు డ్రైవర్ ను కోరాడు.

అయితే బస్సును ఏకంగా ఆపేశాడు డ్రైవర్. చాలాసేపు వరకు ఆ పులి కర్టన్ గట్టిగా పట్టుకుని విడిచిపెట్టలేదు. మరోవైపు బస్సులో ఉన్న టూరిస్టులు కొందరు భయపడిపోయారు. పులి తమను ఏం చేస్తుందేనని భయపడిపోయారు. అయితే చాలా సేపటి తర్వాత పులి ఆ కర్టన్ ను విడిచిపెట్టడంతో బస్సు ముందుకు కదిలింది. బస్సులోని టూరిస్టులు అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

శుక్రవారం(ఫిబ్రవరి-14,2020)సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఉన్నతాధికారుల దృష్టికి వచ్చిందని,బస్సు డ్రైవర్ ఓంప్రకాష్ భారతి,టూర్ గైడ్ నవీన్ పురైనాను తొలగించినట్లు అధికారులు తెలిపారు. సఫారీ స్టాండర్డ్ ప్రొటోకాల్ ను వాళ్లు మర్చిపోయారని నందన్ వన్ జంగిల్ సఫారీ డైరక్టర్ ఎమ్ మెర్సీ బెల్లా తెలిపారు.

సఫారిలో జంతువులు మరియు సందర్శకులకు భద్రత కల్పించడానికి గైడ్లు మరియు డ్రైవర్లకు శిక్షణ ఇస్తారని, కాని ఈ ఇద్దరు సిబ్బంది ప్రోటోకాల్‌ను విస్మరించారని,బస్సును వేగంగా పోనివ్వటంకు బదులుగా అక్కడే వారు వేచి ఉండి, పరిస్థితి సాధారణయ్యేవరకు అలాగే ఉండిపోయారని ఆయన తెలిపారు. టూరిస్టు వాహనం ఇన్ చార్జ్ ఫారెస్ట్ గార్డ్ కు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు ఆయన తెలిపారు.

Read More>>రైతులను బ్రోకర్లు అనడంతో ఎమ్మార్వో వనజాక్షిపై తిరగబడ్డ రైతులు