Corona Vaccine : కరోనా టీకా వేసుకుంటే..బీర్ ఫ్రీ..ఎక్కడో తెలుసా

దేశ రాజధాని ఢిల్లీ పొరుగున ఉన్న హార్యానాలోని గుర్గావ్..గోల్డ్ రోడ్ లో ఇండియన్ గ్రిల్ రూమ్ రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్ యాజమాన్యం మందుబాబులకు ఆఫర్ ఇచ్చింది.

Corona Vaccine : కరోనా టీకా వేసుకుంటే..బీర్ ఫ్రీ..ఎక్కడో తెలుసా

Beer

Tika Lagao, Beer Le Jao Is Offer : కరోనా టీకా వేయించుకొనేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికే భారతదేశంలో కరోనా విజృంభిస్తోంది. లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రతొక్కరూ టీకా వేయించుకోవాలని ప్రభుత్వాలు గొంతెత్తి అరుస్తున్నా..డోంట్ కేర్ అంటున్నారు కొంతమంది. దీంతో ప్రజలను చైతన్యపరచడానికి..వారిలో ఉన్న అపోహాలను తొలగించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇదిలా ఉంటే..కొంతమంది వ్యాపారులు, పలు సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. కరోనా టీకా వేయించుకుంటే..బంగారు ముక్కు పుల్ల అని ఓ వ్యాపారి చెప్పగా..తాజగా..ఓ రెస్టారెంట్ వినూత్న ఆఫర్ తో ముందుకొచ్చింది. ఇది కూడా మందుబాబులకే.

దేశ రాజధాని ఢిల్లీ పొరుగున ఉన్న హార్యానాలోని గుర్గావ్..గోల్డ్ రోడ్ లో ఇండియన్ గ్రిల్ రూమ్ రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్ యాజమాన్యం మందుబాబులకు ఆఫర్ ఇచ్చింది. కరోనా టీకా వేయించుకొన్న వారికి బీర్ ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. వ్యాక్సిన్ తీసుకున్న కార్డును చూపిన వారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని, కేవలం వారం వరకు మాత్రమే ఇది కొనసాగుతుందని వెల్లడించింది. టీకాలు వేయించుకునేలా ఎక్కువ మందిని ప్రోత్సహించడానికి ‘ఇండియన్ గ్రిల్ రూమ్‌తో మీ టీకాను జరుపుకోండి’ అనే కొత్త ప్రచారాన్ని కూడా ప్రారంభించింది.

ఇక ఇదిలా ఉంటే…కరోనా టీకా వేయించుకున్న వారికి పలు సంస్థలు, వ్యాపారస్తులు వినూత్నంగా బహుమతులను అందచేస్తున్నారు. గుజరాత్ రాజ్ కోట్ జిల్లాకు చెందిన స్వర్ణకారుల వర్గానికి చెందిన వారు…కరోనా టీకా వేయించుకున్న మహిళలకు ముక్క పుడకలు, పురుషులకు చేతి కడియాలు ఫ్రీగా అందచేశఆరు. జాన్ విజన్ సంస్థ ఉచితంగా ఆహారం అందిస్తోంది.
Read More : IPL 2021 : సూపర్ ఫైట్, ఢిల్లీ క్యాపిటల్స్ Vs చెన్నై సూపర్ కింగ్స్