TikTok : ఇండియాకు త్వరలో టిక్‌టాక్?

దేశంలో త్వరలో టిక్‌టాక్ సేవలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. టిక్‌టాక్ ప్రతినిధులు కేంద్ర ఐటీ శాఖ అధికారులతో తాజాగా భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఐటీ చట్టాలకు లోపడి పనిచేస్తామని టిక్‌టాక్ ప్రతినిధులు చెప్పినట్లు సమాచారం

TikTok : ఇండియాకు త్వరలో టిక్‌టాక్?

Tiktok

TikTok : అత్యంత ప్రజాదరణ పొందిన షార్ట్ వీడియో మేకింగ్ యాప్ టిక్‌టాక్ తిరిగి ఇండియాలో రానుందని వార్తలు వస్తున్నాయి. టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌డాన్స్ భారత ఐటీ మంత్రిత్వ శాఖ అధికారులను సంప్రదించింది. కొత్తగా తీసుకొచ్చిన ఐటీ నిబంధనలు పాటిస్తామని, తమ యాప్ పునరుద్దరించాలని బైట్‌డాన్స్ ప్రతినిధులు కోరినట్లు ది ప్రింట్ పేర్కొంది. అనుమతిస్తే త్వరలో టిక్‌టాక్ సేవలను ప్రారంభిస్తామని ఐటీ శాఖ అధికారులకు బైట్‌డాన్స్ ప్రతినిధులు విన్నవించినట్లు ది ప్రింట్ పేర్కొంది.

కాగా దేశ ప్రజల భద్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం మొత్తం 250 యాప్స్ ను బ్యాన్ చేసింది. వీటిలో ఎక్కువగా చైనా దేశానికి చెందిన యాప్స్ ఉన్నాయి. బ్యాన్ చేయడానికి ముందు షార్ట్ వీడియో మేకింగ్ యాప్ టిక్‌టాక్ కు దేశంలో 20 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఇక ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం PUBGని కూడా బ్యాన్ చేసింది. అయితే దీనికి పోలిన గేమ్స్ ఇండియన్ వెర్షన్స్ వచ్చేశాయి.. PUBG చైనా గేమ్ కానప్పటికీ యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం దీనిని బ్యాన్ చేసింది.

ఇక టిక్‌టాక్ లాంటి యాప్స్ కూడా వచ్చాయి కానీ అంత ఆదరణ పొందలేకపోయాయి. ఈ నేపథ్యంలోనే టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డాన్స్ ప్రతినిధులు ఐటీ శాఖ అధికారులను కలిశారు. తమ కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతివ్వాలని కోరారు. ఇక దీనిపై కేంద్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.