లాక్ డౌన్ లో రోడ్డెక్కిన యువకులను కరోనా రోగి ఉన్న అంబులెన్స్ లో ఎక్కించారు, పోలీసుల కొత్త పనిష్మెంట్

కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి మరీ డ్యూటీలు చేస్తున్నార

లాక్ డౌన్ లో రోడ్డెక్కిన యువకులను కరోనా రోగి ఉన్న అంబులెన్స్ లో ఎక్కించారు, పోలీసుల కొత్త పనిష్మెంట్

కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి మరీ డ్యూటీలు చేస్తున్నారు. మండు టెండుల్లో సైతం విధులు నిర్వహిస్తున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా చూడటంలో పోలీసులు కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇళ్ల నుంచి బయటకు రాకుండా సేఫ్ గా ఉండండి అని పోలీసులు నెత్తీ నోరు బాదుకుంటున్నా కొందరు యువకులు మాత్రం మారడం లేదు. కొందరు పోకిరీలు జులాయిగా రోడ్డు మీదకు వస్తున్నారు. బైక్ ల పై రోడ్డుపైకి వచ్చి చక్కర్లు కొడుతున్నారు.

ఏ మాత్రం బాధ్యత లేకుండా లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేసి ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. దీంతో పోలీసులు లాఠీలకు పని చెబుతున్నారు. కొందరేమో మరో రీతిలో పనిష్మెంట్లు ఇస్తున్నారు. గుంజీలు తీయించడం, రోడ్డుపై పొర్లు దండాలు పెట్టించడం, ప్ల కార్డులు ప్రదర్శించడం, సారీ చెప్పడం ఇలాంటివి చేస్తున్నారు. ఇంత చేసినా పోకిరీల్లో మార్పు రావడం లేదు.

దీంతో తమిళనాడు రాష్ట్రంలోని తిర్పూర్ పోలీసులు కొత్త రకం పనిష్మెంట్ ఇచ్చారు. అనవసరంగా రోడ్డు ఎక్కుతున్న వారికి సరికొత్తగా బుద్ధి చెప్పారు. రోడ్డెక్కిన యువకులను పట్టుకున్న పోలీసులు.. వారిని కరోనా రోగి ఉన్న అంబులెన్స్ లో ఎక్కించారు. దీంతో ఆ యువకులు భయంతో వణికిపోయారు. అంబులెన్స్ లో అటుఇటు తిరిగారు. కాపాడండి అంటూ కేకలు పెట్టారు. మరోసారి రోడ్డు మీదకు రాము, మమ్మల్ని వదిలిపెట్టండి అని పోలీసులను వేడుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి భయంతో పరుగులు తీశారు. పోలీసులు దీన్నంతా వీడియో తీశారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన నిజం ఒకటుంది.

ఆ పోలీసులు నిజం, ఆ యువకులు నిజం, ఆ అంబులెన్స్ నిజం. కానీ.. అంబులెన్స్ లో ఉన్న వ్యక్తికి కరోనా లేదు. అతడు కరోనా పేషెంట్ కానే కాదు. ఇదంతా పోలీసుల సెటప్. ఇలా భయపడితే అయినా పోకిరీలకు బుద్ధి వస్తుందని, అనవసరంగా రోడ్డు మీదకు రారని పోలీసులు అభిప్రాయపడ్డారు. తిర్పూర్ పోలీసుల ఈ వింత పనిష్మెంట్ పై నెటిజన్లు స్పందించారు. నిజంగానే ఇలా చేయాలని, అప్పుడే బుద్ధి వస్తుందని కామెంట్లు పెడుతున్నారు.