TMC అంటే ట్రాన్స్ ఫర్ మై కమిషన్

పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గురువారం(మార్చి-18,2021)పురూలియాలో జరిగిన బహిరంగ సభలో మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతాబెనర్జీపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీవ్ర స్థాయిలో విరుకుప‌డ్డారు.

TMC అంటే ట్రాన్స్ ఫర్ మై కమిషన్

Tmc Created New Breed Of Maoists To Loot Public Money Pm Modi At Purulia Rally1

TMC పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గురువారం(మార్చి-18,2021)పురూలియాలో జరిగిన బహిరంగ సభలో మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతాబెనర్జీపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీవ్ర స్థాయిలో విరుకుప‌డ్డారు. టీఎంసీ అంటే ట్రాన్స్‌ఫ‌ర్ మై క‌మీష‌న్ అన్నారు. క‌మీష‌న్ ఇస్తేనే టీఎంసీ పార్టీ ఏదైనా ప‌నిచేస్తోంద‌న్నారు. బీజేపీ ప్ర‌భుత్వం డీబీటీ త‌ర‌హాలో ప‌నిచేస్తోంద‌ని, డీబీటీ అంటే డైర‌క్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫ‌ర్ అని, తాము నేరుగా ఖాతాల్లో అమౌంట్‌ను జ‌మ చేస్తున్నామ‌ని, కానీ దీదీ నేతృత్వంలోని తృణ‌మూల్ పార్టీ క‌మీష‌న్ల అడ్డాగా మారిన‌ట్లు ఆరోపించారు. కమీష‌న్ల కోసం టీఎంసీ రాజ‌కీయాలు చేస్తోంద‌న్నారు. రైతుల అకౌంట్ల‌కు త‌మ ప్ర‌భుత్వం నేరుగా డ‌బ్బును వేస్తే, ఆ అమౌంట్ ముట్ట‌కుండా చూస్తోంద‌న్నారు.

మమత బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వం పదేళ్ళపాటు ప్రజలతో ఆడుకుందని, ఈ ఆట ఇక చాలునని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మమత బెనర్జీ ‘ఖేలా హోబే’ (మనం ఆడుకుందాం) అనే నినాదంతో దూసుకెళ్తున్నారు. దీనిని మోడీ తిప్పికొడుతూ.. మమత దీదీ, మీరు బెంగాల్ ప్రజల జీవితాలతో ఆడుకున్నారు. నేడు కూడా మీరు ఆట గురించి మాట్లాడుతున్నారు’ అన్నారు. దీదీ ఆడుకుందామంటున్నారు, కానీ బీజేపీ మాత్రం అభివృద్ధి జరుగుతుందని, మహిళలు సాధికారులవుతారని, ప్రతి ఇంటికీ తాగు నీరు అందుతుందని, రైల్వేలు, రోడ్లు బాగుపడతాయని, విద్యను అందజేస్తామని చెప్తోందన్నారు. బెంగాలీలతో మమత బెనర్జీ ఆడుకునే రోజులు పోయాయన్నారు. మమత బెనర్జీ బెంగాలీల జీవితాలతో పదేళ్ళపాటు ఆడుకున్నారని మోడీ విమర్శించారు.

బెంగాల్ ప‌రిస్థితిని దీదీ అత్యంత ద‌యనీయంగా మార్చేసింద‌ని మోడీ తెలిపారు. రాష్ట్రంలో నేర‌స్తులు స్వేచ్ఛ‌గా తిరుగుతున్నార‌ని విమ‌ర్శించారు. క్రైమ్ ఉంది, క్రిమిన‌ళ్లు ఉన్నారున‌, కానీ వాళ్లు ఎవ‌రూ జైళ్ల‌లో లేర‌ని ప్ర‌ధాని విమ‌ర్శించారు. మాఫియా ఉంది.. ఉగ్ర‌వాదులున్నారు.. కానీ వాళ్లంతా స్వేచ్ఛ‌గా తిరుగుతున్నార‌న్నారు. సిండికేట్లు ఉన్నాయి, స్కీమ్‌లు ఉన్నాయి.. కానీ ఎక్క‌డా విచార‌ణ జ‌ర‌గ‌డంలేద‌ని దీదీపై మోదీ ఫైర్ అయ్యారు. అన్ని రంగాలు అభివృద్ధి చెందితేనే అభివృద్ధి సాధ్య‌మ‌ని, కానీ దీదీ ప్ర‌భుత్వం గ‌త ప‌దేళ్ల నుంచి ద‌ళితులు, గిరిజ‌నులు, ఎస్సీ, ఎస్టీల‌ను ప‌ట్టించుకోలేద‌ని మోడీ ఆరోపించారు.

ప్రజల డబ్బును దోచుకోవడానికి టీఎంసీ మావోయిస్టుల కొత్త జాతిని సృష్టించిందన్నారు. టీఎంసీ పదేళ్లపాటు తప్పుడు పరిపాలన అందించిందని, బీజేపీ అధికారంలోకి వస్తే, తప్పుడు పాలన అందించిన టీఎంసీ నేతలను శిక్షిస్తామని చెప్పారు. మే 2వ తేదీన బెంగాల్‌లో బీజేపీ .. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌ధాని తెలిపారు. పుల్వామా ఉగ్రదాడి సమయంలో ఆర్మీని నిందించిన మమతాబెనర్జీని బెంగాల్ ప్రజలు గుర్తుంచుకుంటారని మోడీ అన్నారు.

నందిగ్రామ్ ఘటనను ఉద్దేశించి మోడీ మాట్లాడుతూ..దీదీ కాలికి గాయ‌మైన‌ప్పుడు తాను కూడా చింతించిన‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు. ఆమె గాయం త్వర‌గా కోలుకోవాల‌ని దేవున్ని ప్రార్థిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. బెంగాలీ ప్ర‌జ‌లు ముందు నుంచి ఒక‌టి చెబుతున్నార‌ని, లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో టీఎంసీ స‌గం సీట్లును కోల్పోయింద‌ని, ఈసారి అసెంబ్లీలో ఆ పార్టీ పూర్తిగా కొట్టుకుపోతుంద‌ని అన్నారు.