TMC : అట్టుడుకుతున్న కోల్ కతా.. సీబీఐ అరెస్టులపై టీఎంసీ కార్యకర్తల ఆందోళన

నారదా కుంభకోణం కేసులో ఇద్దరు పశ్చిమ బెంగాల్ కేబినెట్ మంత్రులు, ఓ టీఎంసీ ఎమ్మెల్యేను సీబీఐ అరెస్టు చేయడానికి వ్యతిరేకంగా ఆ పార్టీ ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

TMC : అట్టుడుకుతున్న కోల్ కతా.. సీబీఐ అరెస్టులపై టీఎంసీ కార్యకర్తల ఆందోళన

Tmc

TMC leaders నారదా కుంభకోణం కేసులో ఇద్దరు పశ్చిమ బెంగాల్ కేబినెట్ మంత్రులు, ఓ టీఎంసీ ఎమ్మెల్యేను సీబీఐ అరెస్టు చేయడానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కోల్ కతాలోని సీబీఐ కార్యాలయం ముందు తృణమూల్ జెండాలను పట్టుకొని ధర్నాకు దిగారు. కేంద్ర ప్రభుత్వానికి, సీబీఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొంతమంది టీఎంసీ కార్యకర్తలు సీబీఐ కార్యాలయంపై రాళ్లదాడి చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది.

ఆందోళనకారులను నిలువరించేందుకు భారీ సంఖ్యలో సీఆర్​పీఎఫ్ జవాన్లు రంగంలోకి దిగారు. సీబీఐ కార్యాలయం ఉన్న నిజాం ప్యాలెస్ వద్ద బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే వాటిని కార్యకర్తలు దాటే ప్రయత్నం చేయడంతో అక్కడ ఉద్రిక్తతలకు దారి తీసింది. సీఆర్​పీఎఫ్​తో పాటు కోల్ ​కతా నగర పోలీసులు సైతం మోహరింపులు చేపట్టారు. సీబీఐ కార్యాయలం వెలుపలు పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

ఈ వ్య‌వహారంపై ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ జ‌గ‌దీప్ ధ‌న‌ఖ‌ర్ స్పందించారు. సీబీఐ కార్యాలయంపై రాళ్ల దాడిని ఆయన ఖండించారు. కోల్‌క‌తా, బెంగాల్ పోలీసులు ఆందోళ‌న‌కారులను అదుపు చేయ‌కుండా, ప్రేక్ష‌క‌పాత్ర వ‌హించ‌డంపై గ‌వ‌ర్న‌ర్ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. శాంతి భ‌ద్ర‌త‌ల‌ను కాపాడాల‌ని గ‌వ‌ర్న‌ర్ పోలీసుల‌కు,ప్రభుత్వానికి సూచించారు

మరోవైపు, సీబీఐ..బెంగాల్ కేబినెట్ మంత్రులు ఫీర్హాద్ హకీమ్, సుబ్రత ముఖర్జీని అరెస్ట్ చేసిందన్న విషయం తెలుసుకున్న బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెంటనే నిజామ్ ప్యాలెస్‌లోని సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. ఆమెతో పాటు పలు టీఎంసీ నాయకులు, న్యాయవాదులు కూడా ఉన్నారు. నిబంధలనలకు విరుద్దంగా సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారని మమతా బెనర్జీ ఆరోపించారు. తనను కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇక, మంత్రుల అరెస్ట్ అక్రమమని బెంగాల్ అసెంబ్లీ స్పీకర్ బీమన్ బెనర్జీ తెలిపారు. సీబీఐ అధికారులు తన అనుమతి తీసుకోలేదని చెప్పారు. ఇది బీజేపీ బెంగాల్ ప్రజల మీద చేస్తున్న అతి పెద్ద కుట్ర అని హకీమ్ కూతురు ప్రియదర్శిని ఆరోపించారు.

నారదా కుంభకోణం ఏంటీ

కల్పితంగా సృష్టించిన కంపెనీల ప్రతినిధుల నుంచి కొందరు రాజకీయ నాయకులు లంచం తీసుకుంటున్నారనే అభియోగాలతో సీబీఐ ఈ కేసు నమోదు చేసింది. నారదా టీవీ ఛానెల్ 2014లో చేపట్టిన స్టింగ్ ఆపరేషన్​లో ఈ తతంగం వెలుగులోకి వచ్చింది. కలకత్తా హైకోర్టు ఆదేశాలతో 2017 మార్చిలో దీనిపై దర్యాప్తు ప్రారంభించింది. టీఎంసీకి చెందిన కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇందులో ఉన్నట్లు ఈ ఆపరేషన్ చేపట్టిన మ్యాథ్యూ శ్యామ్యూల్ పేర్కొన్నారు. వీరు డబ్బు తీసుకుంటున్న వీడియో 2016 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బయటకు విడుదలైంది.