MLA: ‘నేను చచ్చిపోయాక నన్ను మర్చిపోకూడదు..అందుకే నా విగ్రహాలు చేయించా’

  • Published By: veegamteam ,Published On : March 14, 2020 / 05:28 AM IST
MLA: ‘నేను చచ్చిపోయాక నన్ను మర్చిపోకూడదు..అందుకే నా విగ్రహాలు చేయించా’

పేరు పొందిన రాజకీయ నేతలు..ప్రజలకు సేవ చేసిన నేతలు చనిపోతే వారికి గౌరవ సూచికంగా విగ్రహలను ఏర్పాటు చేస్తుంటారు. కానీ ఓ ఎమ్మెల్యే ఏకంగా తాను బతికి ఉండగానే తన విగ్రహాలను తయారు చేయించుకున్నారు. నాపై కొంతమంది కక్ష కట్టారు.నన్ను ఏ సమయంలో అయినా సరే చంపేస్తారు..అందుకే నేను చనిపోయాక నన్ను ఎవరూ మరచిపోకూడదని నా విగ్రహాలను తయారు చేయించానంటున్నారు పశ్చిమబెంగాల్  తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జయంత్‌ నాస్కర్‌. 

పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పర్గానాస్ జిల్లాలోని గోసాబా నియోజవర్గ ఎమ్మెల్యే జయంత్‌ నాస్కర్‌(71) మూడేళ్ల క్రితం కోల్‌కతాలో  మంచి పేరున్న శిల్పులతో  రెండు విగ్రహాలను తయారు చేయించుకున్నారు. ఫైబర్‌ గ్లాస్‌తో తయారు చేయించిన తన విగ్రహాలను తన ఇంట్లో బహు భద్రంగా దాచుకున్నారు. 

కాగా..ఇటీవల జయంత్ నాస్కర్ నివాసంలో  జరిగిన పార్టీ సమావేశంలో ఈ విగ్రహాల విషయం బైటపడింది. కాగా జయంత్ సర్కార్ తాను బతికి ఉండగానే తన  విగ్రహాలను తయారు చేయించుకున్న విగ్రహాల ఫోటోలు వైరల్‌ అయ్యాయి.  దీనిపై ఆయన్ని ప్రశ్నించగా..తనకు ప్రాణహాని ఉందని, తాను హత్యకు గురై చనిపోతే.. ప్రజలను మర్చిపోవద్దనే ఉద్దేశంతోనే ఈ విగ్రహాలను తయారు చేయించానని చెప్పుకొచ్చారు.

‘గతంలో నలుగురు హంతకులు అలిపోర్ సెంట్రల్ కరెక్షనల్ హోమ్ నుంచి తప్పించుకున్నారు. కొద్ది రోజుల తర్వాత వారు మళ్లీ పట్టుబట్టారు. వారిని విచారించగా.. నన్ను చంపేందుకు కొంతమంది రాజకీయ నాయకులు వారిని నియమించారని వారు చెప్పారని తెలిపారని అప్పటి జిల్లా సూపరింటెండెంట్ ప్రవీణ్ త్రిపాటీ నాకు చెప్పారని అన్నారు జయంత్ నాస్కర్. 

దీంతో నాకు ‘వై’ కేటగిరి భద్రతను కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ నాకు ప్రాణహాని ఉంది. ఏ క్షణంలోనైనా నేను హత్యకు గురికావొచ్చు. నేను చనిపోయిన తర్వాత ప్రజలు నన్ను మర్చిపోవద్దు. అందుకే విగ్రహాలు తయారు చేయించా‘ అని ఎమ్మెల్యే నాస్కర్‌ అన్నారు. తనకు టీఎంసీలోనే ఎక్కువ శత్రువులు ఉన్నారని, వారంతం ఇంతకు ముందు ఇతర పార్టీలో ఉండేవారని చెప్పుకొచ్చారాయన. 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే..తండ్రి విగ్రహాలుతయారు చేయించటానికి జయంత్ సర్కార్ కొడుకే స్వయంగా మంచి శిల్పుల గురించి తిరిగి తిరిగా ఆఖరుకి విగ్రహాలను తయారు చేయించాడు. అలా చేయించిన విగ్రహాలను వారి నివాసంలోనే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంచారు. ఇప్పటి వరకూ వాటి గురించి ఎవ్వరికీ తెలీదు. ఇటీవల పార్టీ మాస్ ప్రోగ్రామ్ ను జయంత్ సర్కార్ఇంట్లో నిర్వహించిన సమయంలో ఓ రిపోర్టర్ ఈ విగ్రహాలను ఫోటోలు తీయటంతో వెలుగులోకి వచ్చింది. 

తాను చనిపోయిన తరువాత ప్రజలు తనను మరచిపోకూడదనీ..అందుకే తన విగ్రహాలను ముందే చేయించాననీ..తన అభిమానులు వాటిని ఎక్కడ ఆవిష్కరిస్తారో వారి ఇష్టం అంటూ చెప్పుకొచ్చారు తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జయంత్‌ నాస్కర్. 

Also Read | ముడి చమురు ధరలు తగ్గాయి: రూ.3 ఎక్సైజ్ సుంకం పెంచి, లాభాన్ని ఖజానాలో వేసుకున్న ప్రభుత్వం