West Bengal election : టీఎంసీ నేతలకు షాక్, ఇంతకు మించి ప్రచారం చేయను..నుస్రత్ వీడియో వైరల్

బీజేపీ బెంగాల్ ట్విట్టర్ వేదికగా ఓ వీడియో ట్వీట్ చేసింది. అందులో నుస్రత్ జహాన్ ఉన్నారు. 25 సెకన్ల వీడియో క్లిప్ ఉన్న ఈ వీడియోలో నుస్రత్ కు కార్యకర్తలు విజ్ఞప్తి చేయడం వినిపిస్తోంది.

West Bengal election : టీఎంసీ నేతలకు షాక్, ఇంతకు మించి ప్రచారం చేయను..నుస్రత్ వీడియో వైరల్

Tmc

TMC MP Nusrat Jahan : పశ్చిమ బెంగాల్ లో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న టీఎంసీ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన కీలక లీడర్స్ బీజేపీలోకి జంప్ అవుతున్నారు. ఎలాగైనా ఇక్కడ పాగా వేయాలని, దీదీకి షాక్ ఇవ్వాలని కాషాయ దళం భావిస్తోంది. అనుకున్నట్లుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. విమర్శల దాడులతో పొలిటికల్ హీటెక్కుతోంది. అయితే..టీఎంసీ పార్టీకి చెందిన ఎంపీ నుస్రత్ జహాన్ కు సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారుతోంది.

వెస్ట్ బెంగాల్ లో 8 దశల్లో ఎన్నికలు జరుగబోతున్నాయన్న సంగతి తెలిసిందే. పలు ప్రాంతాల్లో మొదటి దశ ఎన్నికలు జరిగిపోయాయి. మిగతా ప్రాంతాల్లో ప్రధాన పార్టీలైన బీజేపీ, టీఎంసీ ముఖ్యనేతలు, కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎంపీ నుస్రత్ జహాన్ కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. 2021, మార్చి 29వ తేదీ సోమవారం బీజేపీ బెంగాల్ ట్విట్టర్ వేదికగా ఓ వీడియో ట్వీట్ చేసింది. అందులో నుస్రత్ జహాన్ ఉన్నారు. 25 సెకన్ల వీడియో క్లిప్ ఉన్న ఈ వీడియోలో నుస్రత్ కు కార్యకర్తలు విజ్ఞప్తి చేయడం వినిపిస్తోంది. గంటకు పైగా తాను ప్రచారం చేయడం జరిగిందని, ఇక తన వల్ల కాదని..సీఎం కోసం కూడా ఇంతకు మించి ప్రచారం చేయనని నుస్రత్ ఆ వీడియో వ్యాఖ్యానించారు.

తీవ్ర అసహనంతో ఉన్నట్లు కనిపించిన ఆమె..వాహనం పై నుంచి కిందకు దిగిపోయారు. మెయిన్ రోడ్డు వరకు ర్యాలీ చేయాలని పార్టీ సభ్యులు కోరినా..ఆమె అందుకు అంగీకరించలేదు. సీఎం కోసం కూడా ఇంతకుమించి ప్రచారం చేయనని నుస్రత్ చెప్పడంతో అక్కడున్న కార్యకర్తలు విస్తుపోయారు. #MamataLosingNandigram హ్యాష్ ట్యాగ్ తో బెంగాల్ బీజేపీ ట్విట్టర్ ఈ వీడియో పోస్టు చేసింది.


Read More : Risk of Covid-19 infection : వ్యాక్సిన్ వేయించుకున్నా మీకు కరోనా రావచ్చు.. జాగ్రత్త!