ఖలీ ప్రచారంపై ఈసీకి టీఎంసీ ఫిర్యాదు

  • Published By: venkaiahnaidu ,Published On : April 28, 2019 / 10:01 AM IST
ఖలీ ప్రచారంపై ఈసీకి టీఎంసీ ఫిర్యాదు

 అమెరికా పౌరసత్వం కలిగిన రెజ్లర్ ది గ్రేట్ ఖలీ వెస్ట్ బెంగాల్ లో బీజేపీ అభ్యర్థి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై తృణమూల్ కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది. ఈ మేరకు టీఎంసీ ఎలక్షన్ కమిషన్ కు ఓ లెటర్ రాసింది.ఓ విదేశీయుడు భారతీయ ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఇవ్వడం నిబంధనలకు విరుద్దమని శనివారం(ఏప్రిల్-28,2019 ఈసీకి రాసిన లేఖలో టీఎంసీ తెలిపింది.వెస్ట్ బెంగాల్ లోని జాదవ్ పూర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అనుపమ్ హజ్రాకు మద్దతుగా శుక్రవారం(ఏప్రిల్-26,2019) ఖలీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విషయం తెలిసిందే.అనుపమ్ తనకు మంచి స్నేహితుడని,మద్దతిచ్చేందుకు అమెరికా నుంచి వచ్చినట్లు ఖలీ తెలిపాడు.

బంగ్లాదేశ్ చెందిన నటుడు అహ్మద్ ఇటీవల వెస్ట్ బెంగాల్ లో టీఎంసీ ఎంపీ అభ్యర్థి తరపున ప్రచారంలో పాల్గొన్న సమయంలో బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.దేశీయ ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్ వీదేశీయులతో ప్రచారం నిర్వహిస్తోందని ఆరోపించింది.అంతేకాకుండా తృణముల్,బీజేపీ ఫైట్ హోం మంత్రిత్వ శాఖ వరకు వెళ్లింది.చివరకు హోం మంత్రిత్వ శాఖ…టీఎంపీ తరపున ప్రచారంలో పాల్గొన్న అహ్మద్ బిజినెస్ వీసా రద్దు చేసి భారత్ వదిలి వెళ్లాలంటూ అతడికి నోటీసు జారీ చేసింది.అంతేకాకుండా అహ్మద్ ను బ్లాక్ లిస్ట్ లో చేర్చింది.