అక్రమ సంబంధాల హత్యల్లో చెన్నై మొదటి స్ధానంలో ఉంది

  • Published By: murthy ,Published On : October 3, 2020 / 12:49 PM IST
అక్రమ సంబంధాల హత్యల్లో చెన్నై మొదటి స్ధానంలో ఉంది

అక్రమ సంబంధాల కారణంగా జరిగిన హత్యల్లో చెన్నై మొదటి స్దానంలో నిలిచింది. దేశంలోని 19 మెట్రోపాలిటన్ నగరాల్లోని 2 మిలియన్లకుపైగా జనాభా ఉన్న వాటిలో గతేడాది తీసిన గణాంకాల ప్రకారం చెన్నై మొదటి స్ధానంలో ఉందని NCRB లెక్కలు చెపుతున్నాయి. 2019 లో వివాదాల కారణంగా చెన్నైలో 90 హత్యకేసులు నమోదు అయ్యాయి. 2019 లో సీనియర్ సిటిజన్లను హత్య చేసిన కేసుల్లో తమిళనాడు లో అత్యధిక కేసులు నమోదై రెండవ స్ధానంలో  నిలిచింది.

గతేడాది అక్టోబర్ లో 23 ఏళ్ల యువతి తన ప్రియుడితో వివహేతర సంబంధం కొనసాగించటానికి భర్తను హత్య చేసింది. హత్యనుకప్పిపుచ్చటానికి అతిగామద్యం సేవిచటం వల్ల మరణించాడని కట్టు కధలు అల్లింది. కానీ పోలీసు విచారణలో అన్ని విషయాలు వెలుగు చూసి ఆమె జైలు జీవితం గడుపుతోంది. ఇలాంటి అక్రమ సంబంధాల వల్ల జరిగిన హత్యల్లో దేశంలోనే చెన్నై మొదటి స్ధానంలో నిలిచింది.




NCRB తాజాగా విడుదల చేసిన లెక్కల ప్రకారం 2019 లో అక్రమ సంబంధాల కారణంగా చెన్నైలో 28 హత్యలు జరిగి మొదటి స్ధానంలో నిలిచింది. చెన్నైలో వివాదాలకు సంబంధించి 90 హత్య కేసులు నమోదయ్యాయి. వీటిలో చెన్నై రెండో స్ధానంలో ఉండగా ఢిల్లీ 125 కేసులతో మొదటిస్ధానంలో ఉంది.




కుటుంబ వివాదాలపై 60 కేసులు, చిన్న చిన్న గొడవలు 34, వ్యక్తిగత శత్రుత్వం కేసుల 52నమోదై చెన్నై మొదటి స్ధానంలో నిలిచింది.  సీనియర్ సిటిజన్లను హత్య చేసిన కేసుల్లో తమిళనాడు దేశంలో రెండవ స్దానంలో ఉంది. 2019 లో రాష్ట్రంలో ఇటువంటివి 117 కేసులు నమోదు కాగా, ఉత్తర ప్రదేశ్ లో 209కేసులు నమోదై మొదటి స్ధానంలో ఉంది.

ఈగణాంకాలు చూసి దేశంలో ఒంటరిగా నివసిస్తున్న వయో వృధ్దుల వివరాలు సేకరించటానికి అన్ని పోలీసుస్టేషన్లను అప్రమత్తం చేసినట్లు పోలీసు అధికారి ఒకరు చెప్పారు.