TN Couple Donates : గ్రేట్.. రూ.37లక్షలను కొవిడ్ స‌హాయ నిధికి విరాళంగా ఇచ్చిన కొత్త జంట

త‌మిళ‌నాడులోని ఓ కొత్త జంట గొప్ప మనసు చాటుకుంది. క‌రోనా స‌మ‌యంలో త‌మ పెళ్లిని సింపుల్‌గా చేసుకుని మిగిలిన డ‌బ్బును కొవిడ్ స‌హాయ నిధికి ఇచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచింది.

TN Couple Donates : గ్రేట్.. రూ.37లక్షలను కొవిడ్ స‌హాయ నిధికి విరాళంగా ఇచ్చిన కొత్త జంట

Tn Couple Donates

TN Couple Donates : త‌మిళ‌నాడులోని ఓ కొత్త జంట గొప్ప మనసు చాటుకుంది. క‌రోనా స‌మ‌యంలో త‌మ పెళ్లిని సింపుల్‌గా చేసుకుని మిగిలిన డ‌బ్బును కొవిడ్ స‌హాయ నిధికి ఇచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచింది.

అను, అరుల్ ప్రాణేశ్ అనే వ‌ధూవ‌రులు మొద‌ట త‌మ పెళ్లికి రూ.50 ల‌క్ష‌లు ఖ‌ర్చ‌వుతుంద‌ని అంచ‌నా వేశారు. పెళ్లి ఖర్చుల కోసం డబ్బు తీసిపెట్టారు. ఈ నెల 14న వారి పెళ్లి జరిగింది. లాక్ డౌన్ కారణంగా వివాహానికి రూ.13 ల‌క్ష‌లు మాత్ర‌మే ఖ‌ర్చ‌య్యాయి. ఇంకా 37లక్షలు మిగిలింది. ఆ డబ్బుని వారు ప‌లు ప్ర‌భుత్వ‌, స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌కు విరాళంగా ఇచ్చారు.

కొవిడ్ భ‌యం కార‌ణంగా చాలామంది ఆహ్వానితులు రాలేద‌ని, చివ‌రికి ఫంక్ష‌న్ హాల్ ఓన‌ర్ కూడా తామిచ్చిన అడ్వాన్స్‌ను తిరిగి ఇచ్చేశార‌ని వ‌రుడు అరుల్ ప్రాణేశ్ చెప్పాడు. ఈ ప‌రిస్థితుల్లోనూ పెళ్లిని వాయిదా వేయ‌కూడ‌ద‌ని పెద్ద‌లు నిర్ణ‌యించార‌ని, దీంతో తాము వ‌ట్ట‌మాలై అంగ‌ల‌మ్మ‌న్ ఆల‌యంలో పెళ్లి చేసుకున్న‌ట్లు చెప్పాడు. స్థానిక అధికారుల అనుమ‌తితో కొద్దిమంది స‌మ‌క్షంలో పెళ్లి జ‌రిగిన‌ట్లు తెలిపాడు. చారిటీ ప‌ని చేసే స్థానిక తిరుప్పూర్ వెస్ట్ రోట‌రీ క్ల‌బ్‌లో స‌భ్యులైన కుటుంబం కావ‌డంతో ఆ సంస్థ‌కు మిగిలిన డ‌బ్బును విరాళంగా ఇచ్చేశారు. కొత్త జంట చేసిన పనిని అందరూ మెచ్చుకుంటున్నారు.