Vaccination In India : కోవిడ్ థర్డ్ వేవ్ ని ఆపడానికి..భారత్ కి రోజూ 87లక్షల వ్యాక్సిన్ డోసులు అవసరం!

దేశంలో కోవిడ్ థర్డ్ వేవ్ రాకుండా అడ్డుకునేందుకు భారత్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది.

Vaccination In India : కోవిడ్ థర్డ్ వేవ్ ని ఆపడానికి..భారత్ కి రోజూ 87లక్షల వ్యాక్సిన్ డోసులు అవసరం!

Vaccine

Vaccination In India దేశంలో కోవిడ్ థర్డ్ వేవ్ రాకుండా అడ్డుకునేందుకు భారత్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కోవిడ్ రెండో దశ మాదిరిగానే థర్డ్ వేవ్ కూడా ఉంటుందంటూ పలు అధ్యయనాలు చెబుతున్న నేపథ్యంలో..కోవిడ్ థర్డ్ వచ్చినా దాని ప్రభావం భారీగా ఉండకుండా నివారించడంలో భాగంగా ఆరోగ్య నిపుణులు, వ్యాక్సిన్ తయారీదారులు,అడ్మినిస్ట్రేటర్స్ ఇలా అందరూ తమ తమ స్థాయిల్లో తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే దేశంలో ఇంకా వ్యాక్సినేషన్ మరింత వేగం పుంజుకోవాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 35 కోట్లకు పైగా కోవిడ్ వ్యాక్సిన్ డోసులను ప్రజలకు అందించారు.

కోవిడ్ థర్డ్ వేవ్ ని అడ్డుకోవాలంటే దేశ జనాభాలో కనీసం 60 శాతం మందికి డిసెంబర్ చివరి నాటికి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేయాల్సి ఉంటుందని నిపుణులు అంచనా వేశారు. అంటే ప్రతి రోజూ దేశంలో 86లక్షల మందికి వ్యాక్సిన్ అందించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఆ స్థాయిలో వ్యాక్సినేషన్ జరగడం లేదు. ఇలా అయితే కోవిడ్ థర్డ్ వేవ్ ని ఆపడం కష్టమవుతుందని,వ్యాక్సినేషన్ ను ఎంత స్పీడ్ గా సాగిస్తే అంత మంచిదని నిపుణులు చెబుతున్నారు. కాగా, దేశంలో ఇంకా వ్యాక్సిన్ల కొరత కొంత ఉంది. దీంతో విదేశీ వ్యాక్సిన్లకు కూడా భారత్ గ్రీన్ సిగ్నల్ ఇస్తోన్న విషయం తెలిసిందే.