Taiwan Jama : తైవాన్ జామకు… తేయాకు దోమ బెడద

దోమ కాటుకు గురైన పిందెలు, కాయలను, రాలిన పండ్లను సేకరించి కాల్చేయాలి. తోటలో పరిశుభ్రత చర్యలను పాటించాలి. ఏటా చెట్లలో ఉండే గుబురు కొమ్మల్ని పూర్తిగా కత్తిరించాలి.

Taiwan Jama : తైవాన్ జామకు… తేయాకు దోమ బెడద

Thiwan Guava

Taiwan Jama : తైవాన్ జామ తోటల సాగు ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా చేపడుతున్నారు. ఈక్రమంలో తైవాన్ జామ రైతులు ప్రస్తుతం తేయాకు దోమతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ దోమ పంటను ఆశించి నష్టాన్ని కలిగిస్తుంది. రైతులు సకాలంలో దీని నివారణకు చర్యలు చేపడితే మంచి దిగుబడులు పొందవచ్చు. తేయాకు దోమ తైవాన్ జామ, జీడి మామిడి తోటల్లో పూ మొగ్గలు, పూలను , పూరెమ్మలను ఆశించి పూత నిలవకుండా , పిండె కట్టకుండా చేస్తుంది. కొన్ని సందర్భాల్లో పుష్ఫగుచ్చలాలు మొత్తం ఎండి మగ్గిపోయేటట్లు చేస్తుంది.

దోమ ఆశిస్తే లేత రెమ్మలు ఎండిపోతాయి. పురుగు సోకిన జామ కాయలను మార్కెట్లో సరైన ధర లభించదు. ఈ కాయలతో తయారు చేసే జామ్ స్క్వాష్ లు ఎక్కువ కాలం నిల్వ ఉండవు. ప్రాధమిక దశలోనే పురుగు ఉనికిని గుర్తించి నియంత్రించాలి. లేకుంటే పిల్ల తల్లి పురుగులు ఆకులను లేత చిగుళ్ళను పండ్లను ఆశించి రసాన్ని పీలుస్తాయి. దీంతో చిగుళ్ళు గోధుమ రంగు లోకి మారతాయి. క్రమంగా ఆకులు , రెమ్మలపై నల్లటి చారలు ఏర్పడతాయి. కాయలపై నల్లటి బొబ్బలు వచ్చి, కండ లోపల అక్కడక్కడ గడ్డలు ఏర్పడతాయి. కాయలు ఆకారం కోల్పోయి చెట్ల నుండి రాలిపోతాయి.

యాజమాన్యం ; దోమ కాటుకు గురైన పిందెలు, కాయలను, రాలిన పండ్లను సేకరించి కాల్చేయాలి. తోటలో పరిశుభ్రత చర్యలను పాటించాలి. ఏటా చెట్లలో ఉండే గుబురు కొమ్మల్ని పూర్తిగా కత్తిరించాలి. కాయలు కాసిని కొమ్మలను నాలుగింట మూడొంతులు కత్తిరించాలి. ఇలా చేస్తే కాపు కాసిన కొమ్మలకు పక్క కొమ్మలు వచ్చి నాణ్యమైన దిగుబడి వస్తుంది. చెట్ల కత్తిరింపులైన తర్వాత లీటరు నీటికి 3గ్రాముల బ్లైటాక్స్ కలిపి పిచికారి చేయాలి.

కొత్త రెమ్మలు తొడిగే సమయంలో లీటరు నీటికి వేపకషాయం 50 మి.లీ లేదా వేపనూనె 5మి.లీ చొప్పున కలిపి నెలరోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. కొత్త ఆకు తొడిగే సమయంలో ప్రధాన ఎరువులతో పాటు సూక్ష్మ పోషక మిశ్రమాన్ని లీటరు నీటికి 5గ్రా చొప్పున కలిపి పిచికారీ చేయాలి. పిందె సమయంలో పురుగు ఉంటే లీటరు నీటికి క్లోరి ఫైరిఫాస్ 2.5మిలీ కలిపి పిందెలు తడిచేలా పిచికారీ చేయాలి. ఎకరానికి 40 పుసుపు రంగు జిగురు అట్టలను లేదా దీపపు ఎరలను అమర్చి వీటి ఉధ్ధృతి కొంత తగ్గించవచ్చు.

కాపు తగ్గిన ముదురు తోటల్లో చీడపీడలు అధికంగా ఆశించే చెట్లలో చీడపీడలు అధికంగా ఆశించే చెట్లలో పునురుద్ధరణ చర్యలు చేపట్టాలి. ఈ చెట్లలో 4అడుగుల ఎత్తులో కొమ్మల్ని కత్తిరించాలి. అనంతరం కత్తిరించిన భాగాలపై బోర్డో పేస్ట్, లేదా ఆవుపేడ పూయాలి. తోటల్లో సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. వార్షాకాలంలో ఖాళీ స్ధలంలో జీలుగ, జనుము పైర్లను పచ్చిరొట్టగా పెంచి పూత దశలో నేలలో కలియదున్నాలి.