Gold Price Today : క్రమంగా పెరుగుతున్న బంగారం ధరలు

బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. మార్చి 31 నుంచి ఆగస్టు 15 వరకు బంగారంపై రూ.3000 పెరిగింది. ఇక ఆగస్టు 15 రోజు రూ.300 పెరిగింది.

Gold Price Today : క్రమంగా పెరుగుతున్న బంగారం ధరలు

Gold Price Today (2)

Gold Price Today : శ్రావణ మాసం పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. మరోవైపు బంగారంపై పెట్టుబడి పెట్టేవారి సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతుంది. ఈ కరోనా పరిస్థితుల్లో పెట్టుబడిదారులు ఎక్కువగా బంగారం వైపు మొగ్గుచూపుతున్నారు. ఇక బంగారం ధరలను ఓ సారి పరిశీలిస్తే.. మార్చి 31 తేదీ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.41,000 ఉండగా ఆగస్టు 15 నాటికి రూ.2900 పెరిగి రూ.44,000 చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్చి 31 తేదీ 44,840 ఉండగా ఆగస్టు 15 నాటికి రూ. 3,160 ప్రస్తుతం రూ.48,000 చేరింది. నాలుగు నెలల క్రితం బంగారంపై పెట్టుబడి పెట్టిన వారికి భారీగా లాభాలు వచ్చాయి. ఇక శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.300 పెరగ్గా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.320 పెరిగింది.

వెండి ధర శనివారం భారీగా పెరిగింది. గత 10 రోజుల్లో 8 సార్లు తగ్గగా… 2 సార్లు పెరిగింది. ఆదివారం వెండి ధర 1 గ్రాము రూ.68.20 ఉంది. 10 గ్రాములు ధర రూ.682 ఉండగా కేజీ వెండి ధర రూ.68,200 ఉంది. శనివారం కేజీ వెండి ధర రూ.900 పెరిగింది. వెండి నగలు కొనుక్కోవాలి అనుకునేవారికి ఇది సరైన సమయమే అని బులియన్ నిపుణులు చెబుతున్నారు. జూన్ 1న కేజీ వెండి ధర రూ.76,800 ఉంది. ఇప్పుడు రూ.68,200 ఉంది. అంటే ఈ రెండున్నర నెలల కాలంలో ధర రూ.8,600 తగ్గింది.

దేశంలో ప్రధాన నగరాల్లో ధరలు..
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,350 గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,150గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,380లుగా ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,050 ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 లుగా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 లుగా ఉంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000లుగా ఉంది.