Gold Rate Today : గడిచిన 10 రోజుల్లో రూ.900 పెరిగిన బంగారం ధర

బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన పది రోజుల్లో 9 సార్లు బంగారం రేటు పెరగ్గా, ఒకసారి తగ్గింది.. 2 సార్లు స్థిరంగా ఉంది.

Gold Rate Today : గడిచిన 10 రోజుల్లో రూ.900 పెరిగిన బంగారం ధర

Gold Rate (2)

Gold Rate Today : బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన పది రోజుల్లో 9 సార్లు బంగారం రేటు పెరగ్గా, ఒకసారి తగ్గింది.. 2 సార్లు స్థిరంగా ఉంది. బంగారం రేట్లు ఇంకా పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం కొనేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు ఇది మంచి సమయమని చెబుతున్నారు నిపుణులు. ఇక ఆఫ్ఘానిస్తాన్ పరిస్థితి బంగారం ధరల పెరుగుదలకు ఒక కారణమని చెబుతున్నారు.

గడిచిన పది రోజుల్లో 10 గ్రాముల బంగారంపై రూ.900 పెరిగింది. ఇంకా పెరిగితే సామాన్య ప్రజలకు, నగలు కొనేవారికీ ఇబ్బందే.

నేటి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

22 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి 1 గ్రాము రూ.4,425 ఉంది. 10 గ్రాములు కావాలంటే దాని ధర రూ.44,250 ఉంది. శుక్రవారం 10 గ్రాముల బంగారం రూ.150 పెరిగింది.

24 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి 1 గ్రాము రూ.4,828 ఉంది. 10 గ్రాములు కావాలంటే దాని ధర రూ.48,280 ఉంది. నిన్న 10 గ్రాముల బంగారం ధర రూ.180 పెరిగింది.

హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,250 ఉంది.
విజయవాడలో 10 గ్రాములు 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,250 ఉంది.
విశాఖపట్నంలో 10 గ్రాములు 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,250 ఉంది.
బెంగళూరులో 10 గ్రాములు 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,250 ఉంది.
చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,650కి చేరింది.
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,400 ఉంది.
కోల్‌కతాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,590 ఉంది.
ముంబైలో 10 గ్రాములు 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,400 ఉంది.

వెండి ధరలు గడిచిన పది రోజుల్లో 6 సార్లు తగ్గగా 2 సార్లు పెరిగింది. రెండు సార్లు స్థిరంగా ఉంది. శనివారం ఉదయానికి వెండి ధర 1 గ్రాము రూ.67 ఉంది. 10 గ్రాములు కావాలంటే ధర రూ.670 ఉంది. కేజీ వెండి ధర రూ.67,000 ఉంది. శుక్రవారం కేజీ వెండి ధర రూ.400 తగ్గింది. జూన్ 1న కేజీ వెండి ధర రూ.76,800 ఉంది. ఇప్పుడు రూ.67,000 ఉంది. అంటే… ఈ రెండున్నర నెలల కాలంలో ధర రూ.9,800 తగ్గింది.