Covid-19 : దేశంలో కొత్తగా 36,571 కరోనా కేసులు.. 530 మంది మృతి

దేశంలో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 36,571 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి

Covid-19 : దేశంలో కొత్తగా 36,571 కరోనా కేసులు.. 530 మంది మృతి

Covid 19

Covid-19 : దేశంలో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 36,571 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. 24 గంటల్లో కరోనా నుంచి కోలుకొని 39,157 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 530 మంది మృత్యువాతపడ్డారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,23,22,258కు పెరిగింది.

ఇందులో 3,15,25,080 మంది బాధితులు కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. ప్రస్తుతం ప్రస్తుతం 3,63,605 యాక్టివ్‌ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ చెప్పింది. జాతీయ రికవరీ రేటు 97.54 శాతానికి పెరిగిందని, రోజువారీ పాజిటివిటీ రేటు 1.94శాతంగా ఉందని పేర్కొంది. మరోవైపు టీకా డ్రైవ్ శరవేగంగా కొనసాగుతుంది.

రోజులు 60 నుంచి 80 లక్షల మంది టీకా తీసుకుంటున్నారు. ఇప్పటివరకు 57.22 కోట్లమందికి టీకా పూర్తైంది. ఇక సెప్టెంబర్ నెలలో స్పుత్నిక్ వి సింగిల్ డోస్ టీకా రానుంది. ఈ టీకా అందుబాటులోకి వస్తే.. వ్యాక్సినేషన్ ప్రక్రియ పుంజుకుంటుంది.