Corona Cases : దేశంలో స్వల్పంగా పెరిగిన రోజువారీ కరోనా కేసులు

శంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. బుధవారం 10,197 కరోనా కేసులు నమోదు కాగా గురువారం 11,919 కరోనా కేసులు వెలుగుచూశాయి.

Corona Cases : దేశంలో స్వల్పంగా పెరిగిన రోజువారీ కరోనా కేసులు

Corona Cases (2)

Corona Cases : దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. బుధవారం 10,197 కరోనా కేసులు నమోదు కాగా గురువారం 11,919 కరోనా కేసులు వెలుగుచూశాయి. తాజాగా నమోదైన కేసులతో దేశంలో ఇప్పటివరకు 3,44,78,517కు చేరాయి. కొత్త కేసుల్లో 6849 కేసులు ఒక్క కేరళలోనే ఉన్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. అయితే కేరళలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతున్నట్లు తెలుస్తోంది.

చదవండి : Corona Cases : భారత్ లో కొత్తగా 8,865 కరోనా కేసులు..197 మరణాలు

ఇక ఇప్పటివరకు 3,38,85,132 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. 1,28,762 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 4,64,623 మంది మృతిచెందారు. గడిచిన 24గంటల్లో 11,242 మంది కరోనా నుంచి బయటపడగా, 470 మంది మరణించారని తెలిపింది. ఇక మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 0.37 శాతం ఉన్నాయని, 2020 మార్చి తర్వాత ఇదే అత్యంత కనిష్ఠమని పేర్కొన్నది.

చదవండి : Coronavirus Update: దేశంలో తగ్గిన యాక్టీవ్ కరోనా కేసులు.. లేటెస్ట్ లెక్కలు ఇవే!

దేశంలో 306 రోజులుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. బుధవారం వరకు దేశ వ్యాప్తంగా 114.46 కోట్ల డోసుల టీకాలు అందిస్తున్నారు. నిన్న 73,44,739 డోసుల టీకాలు ఇచ్చారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 114,46,32,851 డోసుల టీకాలు అందించారు.