India vs England 3rd ODI: నేడు భార‌త్ – ఇంగ్లండ్ మ‌ధ్య చివ‌రి స‌మ‌రం.. కోహ్లీవైపు అంద‌రిచూపు

ఇంగ్లండ్ గ‌డ్డ‌పై టీమిండియా ప‌ర్య‌ట‌న చివ‌రి అంకానికి చేరింది. టీ20 సిరీస్ ను త‌మ ఖాతాలో వేసుకున్న టీమిండియా వ‌న్డే సిరీస్‌ను కైవ‌సం చేసుకొనేందుకు ప‌ట్టుద‌ల‌తో ఉంది. సిరీస్ ఏ జ‌ట్టుదో నిర్ణ‌యించే నిర్ణ‌యాత్మ‌క మ్యాచ్ ఆదివారం సాయంత్రం మాంచెస్టర్‌లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరగనుంది.

India vs England 3rd ODI: నేడు భార‌త్ – ఇంగ్లండ్ మ‌ధ్య చివ‌రి స‌మ‌రం.. కోహ్లీవైపు అంద‌రిచూపు

India Vs England

India vs England 3rd ODI: ఇంగ్లండ్ గ‌డ్డ‌పై టీమిండియా ప‌ర్య‌ట‌న చివ‌రి అంకానికి చేరింది. టీ20 సిరీస్ ను త‌మ ఖాతాలో వేసుకున్న టీమిండియా వ‌న్డే సిరీస్‌ను కైవ‌సం చేసుకొనేందుకు ప‌ట్టుద‌ల‌తో ఉంది. మూడు వ‌న్డేల సిరీస్ లో తొలివ‌న్డేలో భార‌త్ భారీ విజ‌యం సాధించ‌గా, రెండో వ‌న్డేలో ఓట‌మిపాలైంది. ఇంగ్లండ్ 100 ప‌రుగుల తేడాతో ఇండియా పై విజ‌యం సాధించింది. సిరీస్ ను నిర్దేశించే నిర్ణ‌యాత్మ‌క మ్యాచ్ ఆదివారం సాయంత్రం మాంచెస్టర్‌లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరగనుంది.

India vs England 2nd ODI: చేతులెత్తేసిన బ్యాట్స్‌మెన్‌.. రెండో వన్డేలో టీమిండియా ఓటమి

గ‌త మ్యాచ్ లో ఓడిపోయిన‌ప్ప‌టికీ ఈ రోజు జ‌రిగే 3వ వ‌న్డేలో టీమిండియా జ‌ట్టులో పెద్ద‌గా మార్పులు ఉండ‌క‌పోవ‌చ్చున‌ని తెలుస్తోంది. రోహిత్ శ‌ర్మ బ్యాటింగ్ మ‌రోసారి కీల‌కం కానుండ‌గా.. అంద‌రి చూపు కోహ్లీ వైపే ఉంది. కోహ్లీ వ‌రుస మ్యాచ్ ల‌లో త‌క్కువ స్కోర్ కే పెవిలియ‌న్ బాట ప‌డుతున్నాడు. రెండు వ‌న్డేల్లోనూ కోహ్లీ క‌నీస ఆట‌తీరును ప్ర‌ద‌ర్శించ‌లేదు. ఫామ్ కోల్పోయి ప‌రుగులు రాబ‌ట్టేందుకు తంటాలు ప‌డుతున్నాడు. ఈ క్ర‌మంలో కోహ్లీ ప‌నైపోయిందంటూ విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్ప‌టికే వెస్టండీస్ వెళ్లే టీ20 జ‌ట్టులో కోహ్లీకి అవ‌కాశం ల‌భించ‌లేదు. అయితే కోహ్లీకి మాజీ క్రికెట‌ర్లు మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారు. దీంతో కోహ్లీకి ఈ మ్యాచ్ ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది. భారీ ప‌రుగులు రాబ‌ట్టే ల‌క్ష్యంతో కోహ్లీ క‌స‌ర‌త్తు చేస్తున్నారు. క్రికెట్ ప్రేమికులు సైతం కోహ్లీ ఆట‌తీరు ఏ విధంగా ఉంటుంద‌నే ఆస‌క్తితో ఎదురుచూస్తున్నారు.

India vs England: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో క‌న‌ప‌డి ఆశ్చ‌ర్య‌ప‌ర్చిన ధోనీ

మాంచెస్టర్‌లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జ‌ర‌గ‌నున్న 3వ వ‌న్డేకు టాస్ కీల‌కం కానుంది. ఈ మైదానంలో ఇప్ప‌టి వ‌ర‌కు తొమ్మిది వ‌న్డేలు జ‌ర‌గ‌గా.. ఎనిమిది సార్లు తొలుత బ్యాటింగ్ చేసిన జ‌ట్లే విజ‌యం సాధించాయి. ఇక్క‌డి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. మ‌రోవైపు ఇంగ్లండ్ జ‌ట్టు ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. టీమిండియా సైతం రెండ వ‌న్డేలో కొన‌సాగిన జ‌ట్టునే 3వ వ‌న్డేలోనే కొన‌సాగించే అవ‌కాశం ఉంది. చివ‌రి నిమిషంలో కోహ్లీని ప‌క్క‌న పెట్టే అవ‌కాశాలు లేక‌పోలేదు. ఇప్ప‌టికే కోహ్లీని వెస్టండీస్ టూర్‌కు సెలెక్ట్ చేయ‌క‌పోవ‌టంతో ఇంట‌, బ‌య‌ట తాజా, మాజీ క్రికెట‌ర్ల నుంచి బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ విమ‌ర్శ‌లు ఎదుర్కొంటుంది. ఈ క్ర‌మంలో కోహ్లీని త‌ప్ప‌నిస‌రిగా మూడ‌వ వ‌న్డేలో కొన‌సాగిస్తార‌ని తెలుస్తోంది. మొత్తానికి స్వ‌ల్ప మార్పుల‌తో టీమిండియా మూడు వ‌న్డేల సీరిస్‌లోని కీల‌క మ్యాచ్ లో ఇంగ్లండ్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధ‌మైంది.