Today Petrol Rates : పెట్రోల్, డీజిల్‌ ధరలు.. కొద్ది రోజులుగా అదే ట్రెండ్

గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 15 రోజులకు ఒకసారి ఇంధన ధరల్లో మార్పులు జరుగుతుంటాయనే సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా ఎటువంటి మార్పు లేకపోవడంతో..

Today Petrol Rates : పెట్రోల్, డీజిల్‌ ధరలు.. కొద్ది రోజులుగా అదే ట్రెండ్

Petrol And Diesel Price : గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 15 రోజులకు ఒకసారి ఇంధన ధరల్లో మార్పులు జరుగుతుంటాయనే సంగతి తెలిసిందే. కానీ కొద్ది రోజులుగా ఎటువంటి మార్పు లేకపోవడంతో వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ.100కు పైనే ఉంది. కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించగానే.. అదే బాటలో నడిచాయి బీజేపీ పాలిత రాష్ట్రాలు. దీంతో ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా వ్యాట్‌ను తగ్గించి మరింత ఉపశమనం కలిగించాలని కోరుతున్నారు. ఇప్పటికే కేంద్రం తగ్గింపుతో పెట్రోల్‌పై 6 రూపాయలు, డీజిల్‌పై 11 రూపాయల మేర ధరలు దిగి వచ్చాయి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పెట్రోల్‌పై 32.5 శాతం వ్యాట్‌ విధిస్తోంది.

Read More : World Most Expensive City: బా..గా… డబ్బున్న వాళ్లకు మాత్రమే ఈ ప్రత్యేకమైన సిటీ 

తెలంగాణ

హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.203.. లీటర్ డీజిల్ ధర రూ. 94.62గా ఉంది.
కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.60గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.94.99గా ఉంది.
ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 109.07గా ఉండగా.. డీజిల్ ధర రూ. 95.41గా ఉంది.
మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.50గా ఉండగా.. డీజిల్ ధర రూ.94.90గా ఉంది.
రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.60ఉండగా.. డీజిల్ ధర రూ.94.99గా ఉంది.
వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.69 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది.

Read More : Diamond Gold Rainstorm: వజ్రాల గొడుగు..అరకిలో బంగారం,12 వేల డైమండ్లతో తయారీ

ఆంధ్రప్రదేశ్‌

గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 110.37 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.96.46లకు లభిస్తోంది.
విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.109.05 ఉండగా.. డీజిల్ ధర రూ. 95.18గా ఉంది.
విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.37 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.46 లకు లభిస్తోంది.
విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.36లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.96.40గా ఉంది.

Read More : Gun Firing in US school : అమెరికాలోని స్కూల్‌లో 15 ఏళ్ల బాలుడు కాల్పులు.. ముగ్గురు విద్యార్థుల మృతి

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 103.97గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 86.67 లకు లభిస్తోంది.
ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది.
కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.104.67 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 89.79 గా ఉంది.
చెన్నైలో పెట్రోల్ ధర రూ. 101.40ఉండగా.. డీజిల్ ధర రూ.91.43గా ఉంది.
బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.100.58 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.85.01 గా ఉంది.
లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.13 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.86.67గా ఉంది.