Gold Price : స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. వెండి పరుగులు

బంగారం ధర ఎంతుంది? గోల్డ్ రేట్ పెరిగిందా? తగ్గిందా? పసిడి.. కొనొచ్చా? లేదా? బులియన్ మార్కెట్ నిపుణులు ఏమంటున్నారు..

Gold Price : స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. వెండి పరుగులు

Gold Price (1)

Gold Price : కాలంతో పని లేదు. పండుగలతో నిమిత్తం లేదు. సీజన్ ఏదైనా మన దేశంలో బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజ‌న్‌లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పసిడి ధరలు చుక్కలను తాకుతాయి. పసిడి ధరల్లో రోజురోజుకు ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు తగ్గితే.. మరో రోజు పెరుగుతాయి. ఇక భారతీయ మహిళలకు పుత్తడి అంటే ఎంత మక్కువో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

సోమవారం (జూన్ 13) బంగారం ధర స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర పది రూపాయలు రూ. 48వేల 360గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ కూడా కేవలం పది రూపాయలు మాత్రమే పెరిగి రూ.52,760 గా ఉంది. పుత్తడితో పాటు వెండి ధరలూ పెరిగాయి. కేజీ వెండి ధర రూ. 500 మేర పెరిగి రూ. 67,500గా ఉంది.

RBI New Guidelines : బంగారం దిగుమతులపై ఆర్‌బీఐ కొత్త రూల్స్.. వారికి మాత్రమేనట..!

ఢిల్లీలో పసిడి ధరల పెరుగుదల స్వల్పంగానే ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 10 పెరిగి రూ.48,360గా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 10 పెరిగి రూ.52,760గా ఉంది. ఢిల్లీలో వెండి ధరల్లో మార్పు లేదు. కేజీ వెండి ధర రూ. 62 వేలుగా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు వెలవెలబోతున్నాయి. పసిడి రేటు నేల చూపులు చూసింది. బంగారం ధర 0.18 శాతం పడిపోయింది. దీంతో బంగారం ధర ఔన్స్‌కు 1872 డాలర్ల దగ్గర కదలాడుతోంది. బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. వెండి ధర 1 శాతానికి పైగా పడిపోయింది. 1.05 శాతం క్షీణత నమోదైంది. ఔన్స్‌కు 21.69 డాలర్లుగా ఉంది.

పసిడి ధర సమీప కాలంలో పాజిటివ్ ట్రెండ్‌లోనే కొనసాగవచ్చని, అందుకే పసిడి రేటు పడిపోయినప్పుడల్లా కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. పుత్తడిని కొనుగోలు చేయడానికి చాలా మంది ఇష్టపడతారు. ఇక భారతీయులకు అత్యంత ఇష్టమైనది బంగారం. భారతీయ మహిళలు బంగారానికి అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తుంటారు. ధర ఎంత పెరిగినా బంగారం కొనుగోళ్లు మాత్రం ఆపరు.

Viral News: సముద్ర గర్భంలో భారీగా బంగారం గుర్తింపు ..

బంగారం ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల దగ్గరున్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw