PV Sindhu Success : ఇన్‌క్రెడిబుల్ మైండ్ సెట్, స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్.. పివి సింధు సక్సెస్ స్టోరీ

పివి సింధు. భారత బ్యాడ్మింటన్ స్టార్. తెలుగు తేజం సింధు అద్భుతమైన పోరాట పటిమతో టోక్యో ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించింది. మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్య పతకాన్ని అందుకుంది. వరుసగా రెండోసారి ఒలింపిక్స్‌లో మెడల్‌ సాధించి హిస్టరీ క్రియేట్ చేసింది.

PV Sindhu Success : ఇన్‌క్రెడిబుల్ మైండ్ సెట్, స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్.. పివి సింధు సక్సెస్ స్టోరీ

Pv Sindhu Success

PV Sindhu Success : పివి సింధు. భారత బ్యాడ్మింటన్ స్టార్. తెలుగు తేజం సింధు అద్భుతమైన పోరాట పటిమతో టోక్యో ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించింది. మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్య పతకాన్ని అందుకుంది. వరుసగా రెండోసారి ఒలింపిక్స్‌లో మెడల్‌ సాధించి హిస్టరీ క్రియేట్ చేసింది. కాంస్యం కోసం జరిగిన పోరులో చైనా షట్లర్‌ బింగ్‌ జియావోపై సింధు గెలిచింది. భారత దేశానికి రెండో మెడల్ అందించడం ద్వారా వరసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన ఏకైక భారతీయ బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా సింధు చరిత్ర సృష్టించింది.

పీవీ సింధు పై యావత్ భారత దేశం ప్రశంసల వర్షం కురిపిస్తోంది. సింధు.. దేశానికి గర్వకారణం అంటూ అభినందనలు వెల్లువెత్తాయి. కాగా, సింధు సక్సెస్ వెనుక ఇన్ క్రెడిబుల్ మైండ్ సెట్, స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ ఉందని చెప్పాలి. ఒలింపిక్స్ లో కాంస్యం గెలిచిన తర్వాత.. అతిపెద్ద టోర్నీ ప్లేయర్ గా సింధుని ఎందుకు పరిగణిస్తారో తెలుస్తుంది.

టోక్యో ఒలింపిక్స్ లో సెమీ ఫైనల్ లో ఓటమి తర్వాత సింధు పై అందరికి సందేహాలు కలిగాయి. ఓటమి కారణంగా వచ్చిన నిరాశ నుంచి సింధు బయటపడుతుందా? మళ్లీ కాన్ఫిడెన్స్ సాధిస్తుందా? కాంస్యం కోసం జరిగే పోరులో విజయం సాధిస్తుందా? అనే ప్రశ్నలు తలెత్తాయి. అయితే, వాటన్నింటిని సింధు అధిగమించింది. అద్భుతమైన పోరాటంతో ఘన విజయం సాధించింది. దేశానికి మరో మెడల్ తీసుకొచ్చింది.

సాధారణంగా కీలకమైన టోర్నమెంట్స్ లో ఓటమి ఎదురైతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పడిపోతాయి. ప్లేయర్ ఒక రకమైన నిరాశలో మునిగిపోతాడు. నెక్ట్స్ గేమ్ లో రాణించడం డౌటే. ఓటమి భారంతో కుంగిపోతారు. కానీ, తెలుగు తేజం సింధు అందుకు పూర్తి భిన్నం. ఓటమి ఎదురైనా.. కెరటంలా మళ్లీ లేచింది. పూర్తి కాన్ఫిడెన్స్ తో బరిలోకి దిగింది. తను ఎంత టాలెంటెండ్ ప్లేయర్ అనేది మరోసారి చాటి చెప్పింది.

టోక్యో ఒలింపిక్స్ లో సింధుపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఆమెపై ఎంతో ఒత్తిడి ఉంది. ఈ అంచనాలు, ఒత్తిళ్ల మధ్య ఆమె ఒలింపిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ సెమీ ఫైనల్‌లో ఓటమితో బంగారంతో పాటు వెండి పతకాలు చేజారాయి. ఆ తర్వాత కాంస్యం కోసం జరిగిన పోరులో అద్భుతంగా ఆడి మెడల్ గెలిచింది పీవీ సింధు.

కాగా సెమీస్ లో ఎదురైన ఓటమి నుంచి సింధు త్వరగానే రికవర్ అయ్యింది. రెట్టించిన ఉత్సాహంతో కదన రంగంలోకి దిగింది. ప్రత్యర్థి చైనా షట్లర్‌ బింగ్‌ జియావో కూడా టాలెంటెడ్. పోరు అంత ఈజీ ఏమీ కాదు. అయినా సింధు అదరగొట్టేసింది. టెంపో మెయింటైన్ చేసింది. అద్భుతమైన ఆటతో ఘన విజయం సాధించింది. కాగా, కాంస్య పతకం గెలిచిన వెంటనే ఆమె చెప్పిన మాటలు.. పెద్ద టోర్నమెంట్ ప్లేయర్‌గా సింధుని ఎందుకు పరిగణించాలో స్పష్టం చేస్తుంది.

“నాలో చాలా భావోద్వేగాలు ఉన్నాయి. నేను కాంస్యం గెలిచినందుకు సంతోషించాలా లేదా ఫైనల్‌లో ఆడే అవకాశాన్ని కోల్పోయినందుకు బాధపడాలా? కానీ మొత్తం మీద, నేను ఈ ఒక మ్యాచ్ కోసం నా భావోద్వేగాలను దాచి, నా అత్యుత్తమమైన దాన్ని ఇవ్వాల్సి వచ్చింది, నా భావోద్వేగాల గురించి ఆలోచించలేదు ”అని సింధు చెప్పింది. సింధు అన్న ఈ మాటలు ఇతర అథ్లెట్స్ కు స్ఫూర్తిగా నిలిచాయి. ఒత్తిడిని ఎలా జయించాలి, విజయాన్ని ఎలా దక్కించుకోవాలి అనేది సింధు మాటల ద్వారా తెలుస్తుంది.

2006లో గోపీచంద్ నేషనల్ కోచ్ చీఫ్ అయ్యాడు. ప్రతి ప్లేయర్ కి ఒకే విషయం చెప్పారు. పెద్ద టోర్నీల్లో కనీసం ఒక మెడల్ అయినా సాధించాలని వారికి లక్ష్యం నిర్దేశించారు. అది చాలా ముఖ్యం అని చెపపారు. ర్యాంకుల పాయింట్ల కోసం ఆడటం కన్నా పెద్ద టోర్నీల్లో మెడల్ సాధించడం చాలా గొప్ప విషయం అని వారికి చెప్పారు. గోపీచంద్ చెప్పిన ఈ సూత్రాన్ని సింధు బాగా వంటబట్టించుకుంది. పెద్ద టోర్నీల్లో మెడల్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో 2016 రియో ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ గెలిచింది. 2018 ఏసియన్ గేమ్స్ లో ఫైనల్ చేరింది. అలా ఆమె జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది.

ఓవైపు కోచ్, మరోవైపు తల్లిదండ్రులు.. ఇలా అందరి నుంచి సపోర్ట్ లభించింది. మరోవైపు ఓటమి నుంచి సింధు పాఠాలు నేర్చుకుంది. ఒత్తిడిని జయించింది. ఓడిన ప్రతిసారి మరింత కసిగా ఆడింది. అద్భుతమైన మైండ్ సెట్ ముందుకెళ్లింది. ఆశావహ దృక్పథంతో ప్రయాణం సాగించింది. ఒలింపిక్స్ లాంటి మేజర్ టోర్నమెంట్స్ లో సింధు అద్భుతంగా రాణిస్తోందంటే ఇదే కారణం. కెరీర్ లో సింధు మరిన్ని విజయాలు నమోదు చేయాలని, దేశం కీర్తిని ఇనుమడింపజేయాలని, ప్రపంచ వేదికలపై భారత్ సత్తా చాటాలని కోరుకుందాం.

ప్రపంచ, ఒలింపిక్స్, ఏసియాడ్ పోటీల్లో సింధు గెలిచిన పతకాలు…

మెడల్         మేజర్ ఈవెంట్లు
BRONZE   2020 Tokyo
GOLD        2019 Basel
SILVER     2018 Jakarta
SILVER     2018 Nanjing
SILVER     2017 Glasgow
SILVER      2016 Rio
BRONZE   2013 Copenhagen
BRONZE   2014 Guangzhou