Revathi: కాళ్లకు బూట్లు లేకపోయినా పట్టుదలతో టోక్యో ఒలింపిక్స్ కు రేవతి

చిన్ననాటే తల్లిదండ్రుల్ని కోల్పోయిన ఓ బాలిక పట్టుదల ముందు పేదిరికం కూడా తలవంచింది. నాలుగవ తరగతి చదివే సమయంలో అమ్మానాన్నలను కోల్పోయింది. బామ్మ ఆసరాతో పరుగులో చిరుతపులిని కూడా ఓడించే వేగాన్ని తన కాళ్లలో నింపుకుంది. ఒకప్పుడు పరుగు ప్రాక్టీస్ చేయాలంటే కాళ్లకు బూట్లు కూడా ఉండేవికావు. అలా ఒట్టికాళ్లతోనే పరుగులు పెట్టేది రేవతి. అలా తన పట్టుదలతో ఒలింపిక్స్ కు ఎంపికయ్యే ఘనతను సాధించింది రేవతి వీరమణి.

Revathi: కాళ్లకు బూట్లు లేకపోయినా పట్టుదలతో టోక్యో ఒలింపిక్స్ కు  రేవతి

Revathi Veeramani For The Tokyo Olympics

Revathi Veeramani for the Tokyo Olympics : చిన్ననాటే తల్లిదండ్రుల్ని కోల్పోయిన ఓ బాలిక పట్టుదల ముందు పేదిరికం కూడా తలవంచింది. నాలుగవ తరగతి చదివే సమయంలో అమ్మానాన్నలను కోల్పోయిని ఆ చిన్నారి బామ్మ ఇచ్చిన చిన్నపాటి ఆసరాతో పరుగులో చిరుతపులిని కూడా ఓడించే వేగాన్ని తన కాళ్లలో నింపుకుంది. చదువులో తనకంటూ ఓ ప్రత్యేకస్థానాన్ని సంపాదించింది.వెరసి ఈరోజు ఓ పేదింటి అమ్మాయి జపాన్ రాజధాని టోక్యో ఒలింపిక్స్ కు సెలక్ట్ అయ్యింది. ఆమే పేరు రేవతి. చిరుతవేగం ఆమె సొంతం. గెలుపే కాదు జీవితంలో ఓటములు ఉంటాయని కూడా చిన్నవయస్సులోనే తెలుసుకున్న ఆ అమ్మాయి పట్టుదలతో ఒలింపిక్స్ కు ఎంపికయ్యింది. ఇక పతకం సంసాదించటమే లక్ష్యంగా పలుగుల ప్రాక్టీసులో బిజీ బిజీగా ఉంది తమిళనాడుకు చెందిన రేవతి. ఒకప్పుడు పరుగు ప్రాక్టీస్ చేయాలంటే కాళ్లకు బూట్లు కూడా ఉండేవికావు. అలా ఒట్టికాళ్లతోనే పరుగులు పెట్టేది రేవతి. అలా తన పట్టుదలతో ఒలింపిక్స్ కు ఎంపికయ్యే ఘనతను సాధించింది రేవతి వీరమణి.

ఒలింపిక్స్ కు ఎంపిక అయ్యాక రేవతి సోషల్ మీడియాలో వైరల్ గా మారిందామె. 23 ఏళ్ల రేవతి భారత మిక్స్ డ్ రిలే టీమ్ లో సభ్యురాలు. చిరుతలా పరుగులు తీసే ఈ తమిళమ్మాయి ప్రస్తుతం భారతీయ రైల్వేలో టికెట్ కలెక్టర్ గా విధులు నిర్వర్తిస్తోంది. టోక్యో ఒలింపిక్స్ కు వెళ్లే భారత బృందంలో స్థానం దక్కించుకోవడంతో అందరి దృష్టి ఈ అమ్మాయిపై పడింది. ఆమె పుట్టి పెరిగిన నేపథ్యం పడిన కష్టాలు పట్టుదలతో అథ్లెట్ స్థాయికి ఎదగటంపై ప్రతి ఒక్కరూ శెభాష్ అంటున్నారు.
రేవతి జాతీయస్థాయి అథ్లెట్ గా ఎదగడం అంత ఈజీగా సాధ్యంకాలేదు.

రేవతి మధురై సమీపంలో ఓ గ్రామానికి చెందిన అమ్మాయి. రేవతి నాలుగో తరగతిలో ఉండగానే తల్లిదండ్రులు చనిపోయారు. ఆమె భవిష్యత్తు అంథకారం అయిపోయిందని బంధువులు అనుకున్నారు. కానీ రేవతిని ఆమె బామ్మ ఆరమ్మాళ్ అక్కున చేర్చుకుంది.తనతో పాటు మనుమరాలిని తీసుకొచ్చి..పేదరికంతో ఉన్నా..ఉన్నంతలో చదివించింది. రేవతికి ఆటలంటే ఇష్టమని తెలిసి ప్రోత్సహించింది. అలా స్కూల్ స్థాయిలోనే రేవతి ప్రతిభతో పలువురుని ఆకట్టుకుంది. ముఖ్యంగా పరుగు అంటే రేవతికి ఎక్కడలేని ఇష్టం. పరుగుతో ఉన్నతస్థాయికి వెళ్లాలని టార్గెట్ గా పెట్టుకుంది తన చిన్ననాటే. కనీసం కాళ్లకు బూట్లు కూడా లేకుండా బుల్లెట్ లా పరుగులు తీస్తూ అందరినీ ఆకట్టుకుంది.

అలా కోచ్ కణ్ణన్ దృష్టిలో పడింది. రేవతిలోని అథ్లెట్ ను కణ్ణన్ఆనాడే పసిగట్టారు.అప్పటినుంచి కణ్ణన్ ఆమెకు పరుగు ప్రాక్టీస్ చేయించటమే కాదు ఆమె ఆహారానికి అయ్యే ఖర్చు అంతా తానే భరించారు. అంతేకాదు దాదాపు రేవతి కుటుంబ బాధ్యతలు కూడా చూసేవారు. అలా రేవతికి కుటుంబం గురించి బాధపడకుండా పరుగుమీదనే దృష్టి కేంద్రీకరించేలా ప్రోత్సహించారు కణ్ణన్. అలా రేవతిని అథ్లెట్ గా తీర్చిదిద్దారు. యూనివర్సిటీ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేసిన ఈ తమిళమ్మాయి నేషనల్ స్థాయిలో 3 పతకాలు సాధించింది.

2019లో దోహాలో జరిగిన ఆసియా క్రీడల్లో తృటిలో పతకం చేజార్చుకున్న రేవతి నాలుగో స్థానంలో నిలిచింది. ఒలింపిక్స్ లో పాల్గొనాలనే కలను నెరవేర్చుకుంది తన కోచ్ కణ్ణన్ సహాయంతో.రత్ కు పతకం వచ్చే అవకాశాలున్న క్రీడాంశాల్లో మిక్స్ డ్ రిలే ఈవెంట్ ఒకటి. ఇందులో రేవతి కూడా సభ్యురాలు. రేవతి ప్రదర్శనపై కోచ్, భారత వర్గాలు గట్టి నమ్మకం వ్యక్తం చేస్తుండడం విశేషం.