సాగు చట్టాలపై పవార్ కి తోమర్ కౌంటర్

సాగు చట్టాలపై పవార్ కి తోమర్ కౌంటర్

Tomar counters నూతన వ్యవసాయ చట్టాలపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చేసిన ట్వీట్​లను కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​ తప్పుపట్టారు. ఇటీవల సవరించిన నిత్యావసర వస్తువుల చట్టం ప్రకారం… కార్పొరేట్లు రైతుల నుంచి సరుకులను తక్కువ ధరకు కొనుగోలు చేసి.. వినియోగదారులకు అధిక ధరలకు విక్రయించవచ్చనే భయాలకు దారితీస్తాయని శరద్​పవార్​ ట్వీట్​ చేశారు. కేంద్ర చ‌ట్టాల వ‌ల్ల రైతులు ఆదాయం కోల్పోవ‌డంతోపాటు క‌నీస మ‌ద్ద‌తుధ‌ర కింద పంట‌ల సేక‌ర‌ణ మౌలిక వ‌స‌తుతుల‌పై ప్ర‌తికూల ప్ర‌భావం చూపుతుంద‌ని, మండీ వ్య‌వ‌స్థ‌ను బ‌ల‌హీన ప‌రుస్తుంద‌ని ప‌వార్ శ‌నివారం చేసిన ట్వీట్ లో పవార్ పేర్కొన్నారు.

ఇందుకు స్పందించిన తోమర్.. పవార్​కు బదులిచ్చారు. పవార్​ చేసిన ట్వీట్లు చట్టంలో ఉన్న వాస్తవాలను ప్రతిబింబించేలా లేవని మండిపడ్డారు. కొత్త చట్టాలతో కనీస మద్దతు ధర,మండీలపై ఎలాంటి ప్రభావం ఉండదని,నూతన చట్టాల ద్వారా రైతులు తమ ఉత్పత్తులను ఎవరికైనా అమ్ముకునే సదావకాశం కల్పింస్తోందని తోమర్ తెలిపారు. కేవలం రాష్ట్రంలోనే కాక బయట విక్రయించి మెరుగైన ధరకు అమ్మకోవచ్చని వివరించారు. దీని వల్ల కనీస మద్దతు ధర ఏ విధంగానూ ప్రభావితం కాదన్నారు. సాగు చట్టాలతో ప్రస్తుతం ఉన్న మండీల వ్యవస్థ రద్దుకాదని స్పష్టం చేసిన కేంద్రమంత్రి..ధరల విషయంలో వాటి మధ్య మరింత పోటీ నెలకొంటుందన్నారు.

రైతు సమస్యలపై పూర్తి అవగాహన ఉన్నపవార్.. వారిని పక్కదారి పట్టించేలా వ్యాఖ్యలు చేయడం తగదని తోమర్ హితవు పలికారు. గతంలో పవార్​ కూడా వ్యయసాయ మంత్రిగా పని చేశారన్న తోమర్​..ఆ సమయంలో ఆయన కూడా ఈ రంగంలో సంస్కరణలను తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నించారని గుర్తు చేశారు. వ్యవసాయ చట్టలపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకున్న తరువాత ఆయన తన అభిప్రాయాన్ని మార్చుకుంటారని తోమర్ విశ్వాసం వ్యక్తం చేశారు. చట్టాల వల్ల రైతులకు కలిగే లాభాలను అనుభవజ్ఞులైన పవార్​ వివరించాలని హితపు పలికారు.