Tomato Flu: చిన్నారులకు ముప్పు ఎక్కువ.. చాపకింద నీరులా విస్తరిస్తోన్న టమోటా ఫ్లూ.. అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరిక

ప్రజలను వరుస వైరస్‌లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కరోనా ప్రభావంతో రెండేళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోగా.. ఇటీవలి కాలంలో మంకీపాక్స్ వైరస్ ఆందోళనకు గురిచేసింది. తాజాగా టమోటా ప్లూ ఇన్‌ఫెక్షన్ దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తోంది.

Tomato Flu: చిన్నారులకు ముప్పు ఎక్కువ.. చాపకింద నీరులా విస్తరిస్తోన్న టమోటా ఫ్లూ.. అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరిక

Tomato flu

Tomato Flu: ప్రజలను వరుస వైరస్‌లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కరోనా ప్రభావంతో రెండేళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోగా.. ఇటీవలి కాలంలో మంకీపాక్స్ వైరస్ ఆందోళనకు గురిచేసింది. తాజాగా టమోటా ప్లూ ఇన్‌ఫెక్షన్ దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. అయితే ఈ టమోటా ఫ్లూ ఇన్‌ఫెక్షన్ ముప్పు పిల్లలపై ఎక్కువగా ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు. అయితే టమోటా ఫ్లూకి సంబంధించి కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇతర వైరల్ ఫీవర్ల తరహాలోనే టమోటా ఫ్లూ లక్షణాలు ఉంటాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

Amitabh Bachchan : మరోసారి కరోనా బారిన పడ్డ అమితాబ్.. నాకు కరోనా వచ్చింది అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేసిన బిగ్ బి

దేశంలో టమోటా ఫ్లూ ఇన్‌ఫెక్షన్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. తొలుత దేశంలో కేరళ రాష్ట్రంలోని కొల్లాం జిల్లాలో ఈ ఇన్‌ఫెక్షన్ వచ్చింది. మే 26న తొలికేసు నమోదవగా, జూలై 26 నాటికి బాధితుల సంఖ్య 82 మంది చిన్నారులకు ఈ ఇన్‌ఫెక్షన్ సోకింది. కేరళలతో పాటు తమిళనాడు, ఒడిశా, హర్యానాలోనూ టమోటా ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. అయితే టమోటా ఫ్లూకి కరోనా వైరస్, మంకీపాక్స్, డెంగ్యూ, చికెన్ పాక్స్ లతో ఎలాంటి సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

Increase Appetite Naturally : ఆకలిలేక ఏం తినలేకపోతున్నారా? సహాజంగా ఆకలిని పెంచే ఇంటి ఔషదాల గురించి తెలుసుకోవాల్సిందే!

చిన్నారులపై ఈ వ్యాధి ముప్పు ఎక్కువగా ఉంటుందని ప్రముఖ వైద్య పత్రిక ‘ద లాన్సెట్’ పేర్కొంది. పాఠశాలకు వెళ్లే ఒకటి నుంచి పదేళ్ల వయసున్న చిన్నారుల్లో ఈ వ్యాధి ఎక్కువ కనిపిస్తోంది. అయితే నాపీల వినియోగం, సురక్షితం కాని ఉపరితలాలను తాకడం, వస్తువులను నేరుగా నోట్లో పెట్టుకోవడం వంటి అలవాట్ల వల్ల పిల్లలకు ఈ ముప్పు ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఇంది ప్రాణాంతక ఇన్ ఫెక్షన్ కాకపోయినా కోవిడ్-19 అనుభవాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని ద లాన్సెట్ పేర్కొంది.