Tomato Prices: కిలో టమాట రూ.140..!

గవర్నమెంట్ డేటా ప్రకారం.. దక్షిణాదిలోని కొన్ని ప్రాంతాల్లో టమాట ధరలు రూ.140కు మించిపోయాయి. సెప్టెంబర్ నెల మధ్య నుంచి రిటైల్ మార్కెట్లో పెరుగుతున్న ధరలు బంగారాన్ని తలపిస్తున్నాయి.

Tomato Prices: కిలో టమాట రూ.140..!

Tomato Price

Tomato Prices: గవర్నమెంట్ డేటా ప్రకారం.. దక్షిణాదిలోని కొన్ని ప్రాంతాల్లో టమాట ధరలు రూ.140కు మించిపోయాయి. సెప్టెంబర్ నెల మధ్య నుంచి రిటైల్ మార్కెట్లో పెరుగుతున్న ధరలు బంగారాన్ని తలపిస్తున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా రోజురోజుకూ ఒక్కో రేటుతో కనిపిస్తున్నాయి టమాటాలు.

ఉత్తరాదిలో మాత్రం సోమవారం టమాట రిటైల్ ధర రూ.30 నుంచి రూ.83 వరకూ ఉండగా, పశ్చిమ ప్రాంతాంలో రూ.30 నుంచి రూ.85వరకూ, తూర్పు ప్రాంతంలో రూ.39 నుంచి రూ.80వరకూ పలుకుతున్నట్లు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ చెబుతుంది.

ఇండియా మొత్తంలో టమాటా పలుకుతున్న యావరేజ్ ధర రూ.60వరకూ ఉండగా.. మరో రెండు వారాలు ఇవే ధరలు కొనసాగుతాయని అంటున్నారు.

……………………………………… : బంజారాహిల్స్ కారు ప్రమాదం కేసులో ఇద్దరు అరెస్ట్

కర్ణాటకలోనూ అవే ధరలు హడలెత్తిస్తున్నాయి. మంగళూరు, తూమకూరులో కేజీ టమాట రూ.100 పలుకుతుండగా, ధార్వాడ్ ప్రాంతంలో కేజీ రూ.75, మైసూరులో కేజీ రూ.74, శివమోగా కేజీ రూ.67, దేవనగిరెలో కేజీ రూ.64కేజీ, బెంగళూరులో కేజీ రూ.57 వరకూ పలుకుతుంది.

తమిళనాడులోని రామంతపురంలో కేజీ రూ.102, తిరునెల్వెలీ రూ.92, కుద్దలోరె కేజీ రూ.75, చెన్నై కేజీ రూ.83, ధర్మపురి కేజీ రూ.83 గా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో కేజీ రూ.77, తిరుపతిలో కేజీ రూ.72 పలుకుతుండగా తెలంగాణలోని వరంగల్ రూ.85వరకూ టమాట రేంజ్ పెరిగింది.

………………………………………. : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, వాటిపై నిషేధం

మెట్రో సిటీలు అయిన ముంబైలో రూ.55, ఢిల్లీ కేజీ రూ.56, కోల్‌కతా కేజీ రూ.78, చెన్నైలో కేజీ రూ.83గా ఉంది.