రాజస్థాన్ పంచాయితీ ఎన్నికల బరిలో పాకిస్థాన్ మహిళలు

  • Published By: veegamteam ,Published On : January 17, 2020 / 03:39 AM IST
రాజస్థాన్ పంచాయితీ ఎన్నికల బరిలో పాకిస్థాన్ మహిళలు

పాకిస్థాన్ నుంచి వలస వచ్చిన పాక్ వాసులు రాజస్థాన్ రాష్ట్రంలోని ఓ గ్రామ పంచాయితీ ఎన్నికల్లో పోటీకి దిగారు. ఇండియాలోని రాజస్థాన్ రాష్ట్రంలోని నాట్వారా గ్రామంలోని పంచాయితీ ఎన్నికల్లో పాక్ నుంచి 18 సంవత్సరాల క్రితం వలస వచ్చిన నీతా సోధా నాట్వారా గ్రామంలో జరిగే పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 

ఇటీవల భారత్ పౌరసత్వ బిల్లును సవరించి అమలులోకి తీసుకొచ్చిన క్రమంలో పాకిస్థాన్ నుంచి ఇండియాలోని రాజస్థాన్ కు వలస వచ్చిన నీతా సోధాకు ఇండియా పౌరసత్వాన్ని గత నాలుగు నెలల క్రితం భారత్ కల్పించింది. దీంతో నీతా సోధాన రాజస్థాన్ లోని నాట్వారా పంచాయితీ ఎన్నికల్లో పోటీకి దిగారు. 

ఈ సందర్భంగా నీతా సోధా మాట్లాడుతూ..పాక్ నుంచి 18 సంవత్సరాల క్రితం వలస వచ్చిన తమకు భారత్ పౌరసత్వం లభించిందనీ..ఈ క్రమంలో పంచాయితీ ఎన్నికల్లో పోటీ  చేస్తున్నాననీ ఇప్పుడు తాను భారతీయురాలిని అని చెప్పుకునేందుకు చాలా సంతోషంగా ఉందనీ గర్వంగా ఉందనీ తెలిపారు. తనను ఈ ఎన్నికల్లో గెలిపిస్తే..గ్రామంలో మహిళా సాధికారత కోసం మెరుగైన విద్య కోసం..వైద్యం ప్రజలకు అందేలా కృషి చేస్తానని తెలిపారు నీతా సోధా. స్థానికుల నుంచి తనకు మంచి స్పందన వస్తోందని ఈ ఎన్నికల్లో తాను గెలుస్తానని ధీమాను కల్పిస్తున్నారనీ..తనను ఎంతగానో ప్రోత్సహిస్తున్న స్థానికులకు ఈ సందర్భంగా నీతా సోధా ధన్యవాదాలు తెలిపారు. ఒక సోదరిలా తనను ఆదరిస్తున్నారని నీతా సంతోషం వ్యక్తంచేశారు.

పాకిస్థాన్ కంటే భారత్ లో మహిళలు ఎంతో స్వేచ్ఛగా ఉంటారనీ అది తాను ప్రత్యక్షంగా అనుభవించాననీ..విద్య విషయంలో కూడా పాక్ లో కంటే భారత్ లో మహిళలకు మెరుగుగా ఉంటారని తెలిపారు.  పాక్ మహిళల కంటే భారత్ మహిళలు జీవన స్థితి చాలా బాగుంటుందనీ అన్నారు. ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే మెరుగైన సౌకర్యాల కోసం మహిళా సాధికారత కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు ప్రస్తుతం భారతీయ మహిళ నీతా సోధా.