Big Success For J-K Police : టాప్ లష్కర్ కమాండర్ నదీమ్ అబ్రార్ అరెస్ట్

సోమవారం జమ్మూకశ్మీర్ లో ఉగ్రసంస్థ లష్కర్ ఏ తోయిబా(LeT)టాప్ కమాండర్ నదీమ్ అబ్రార్ ని భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి.

Big Success For J-K Police : టాప్ లష్కర్ కమాండర్ నదీమ్ అబ్రార్ అరెస్ట్

Kashmir (1)

Big Success For J-K Police సోమవారం జమ్మూకశ్మీర్ లో ఉగ్రసంస్థ లష్కర్ ఏ తోయిబా(LeT)టాప్ కమాండర్ నదీమ్ అబ్రార్ ని భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి. శ్రీనగర్ శివార్లలోని పరిమ్ పొరా వద్దనున్న ఓ చెక్ పోస్ట్ వద్ద నదీమ్ మరియు మరో అనుమానితుడిని భద్రతాధికారులు అరెస్ట్ చేశారు. వీరిద్దరి నుంచి ఓ పిస్టోల్,ఓ గ్రనేడ్ నుంచి స్వాధీనం చేసుకున్నారు భద్రతాధికారులు.

కాగా, కశ్మీర్ లో పౌరులపై మరియు భద్రతా దళాలపై పలు దాడుల్లో నదీమ్ ప్రమేయం ఉందని అధికారులు తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో లవాయ్ పొరాలో ముగ్గురు సీఆర్పీఎఫ్ సిబ్బంది హత్య వెనుక నదీమ్ హస్తముందని స్థానిక పోలీసులు తెలిపారు. అనేక హత్యతత్లో నదీమ్ హస్తం ఉందని..అతడి అరెస్ట్ తమకు పెద్ద విజయని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ ఓ ట్వీట్ లో తెలిపారు.