Gangster Goldy Brar: గోల్డీ బ్రార్ వ్యవహారం టాప్ సీక్రెట్.. అమెరికాతో చర్చిస్తున్నాం: పంజాబ్ సీఎం భగవంత్ మన్

పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ అంశం టాప్ సీక్రెట్ అని చెప్పాడు పంజాబ్ సీఎం భగవంత్ మన్.

Gangster Goldy Brar: గోల్డీ బ్రార్ వ్యవహారం టాప్ సీక్రెట్.. అమెరికాతో చర్చిస్తున్నాం: పంజాబ్ సీఎం భగవంత్ మన్

Gangster Goldy Brar: పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ ప్రస్తుతం అమెరికా పోలీసుల అధీనంలో ఉన్నాడు. గోల్డీని ఇండియా తీసుకురావాలని ఇక్కడి ప్రభుత్వం భావిస్తోంది. ఈ అంశంపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మన్ శనివారం మీడియాతో మాట్లాడారు.

Koo-Twitter: భారతీయ మైక్రోబ్లాగింగ్ సైట్ ‘కూ’ ఖాతాను తొలగించిన ట్విట్టర్

గోల్డీ బ్రార్ అంశం టాప్ సీక్రెట్ అన్నారు. ‘‘గోల్డీ బ్రార్ అమెరికాలో పట్టుబడిన అంశంపై ఎక్కువగా మాట్లాడలేం. గోల్డీ బ్రార్ అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐ అధీనంలో ఉన్నాడు. మేం వాళ్లతో సంప్రదింపులు జరుపుతున్నాం. త్వరలోనే గోల్డీ విషయంలో ఒక అవగాహనకు వస్తాం. ఇది వేరే దేశానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి, అక్కడి చట్టాల ప్రకారం నడుచుకోవాలి. ఇప్పటికి ఈ విషయంలో ఇంతకంటే ఎక్కువ సమాచారం ఇవ్వలేం. మిగతా విషయాలన్నీ టాప్ సీక్రెట్’’ అని భగవంత్ మన్ వ్యాఖ్యానించారు. సిద్ధూ హత్య జరిగిన కొంత కాలం తర్వాత ఈ హత్యకు తన గ్యాంగే కారణమని గోల్డీ బ్రార్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. కెనడాలో ఉంటున్న అతడి ఆచూకీ కనుక్కోవడం చాలా కష్టం.

Mla RohitReddy: భాగ్యలక్ష్మి అమ్మవారిపై ప్రమాణం చేసి చెబుతున్నా.. రేపు ఇదే సమయానికి మళ్ళీ వస్తా..: ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి

అయితే, అతడ్ని అమెరికాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, గతంలోనే గోల్డీ బ్రార్ అలియాస్ సతిందర్ సింగ్ కెనడా వదిలి అమెరికాలో ఉంటున్నట్లు ఒక యూట్యూబ్ ఛానెల్ వెల్లడించింది. దీంతో అతడి కోసం వెతికిన అమెరికా అధికారులు గత నెలలో అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు గోల్డీని ఇండియా తీసుకొచ్చి, విచారిస్తే సిద్ధూ హత్యకు సంబంధించిన అసలు విషయాలు తెలుస్తాయి.