చంద్రయాన్-2 మరో ఫొటో: విశ్లేషణతో బయటపెట్టిన ఇస్రో

చంద్రయాన్-2 మరో ఫొటో: విశ్లేషణతో బయటపెట్టిన ఇస్రో
ad

చంద్రయాన్-1లో ఉంచిన మాదిరిగా చంద్రయాన్-2 బోర్డులో అమర్చిన (టీఎంసీ) టెర్రైన్ మ్యాపింగ్ కెమెరా-2 పనితనం చూపించింది. టీఎంసీ-2 (0.4మైక్రీ మీటర్ నుంచి 0.85మైక్రో మీటర్లు)నుంచి దాదాపు 5మీటర్ల వరకూ ప్రత్యకమైన రిసొల్యూషన్& స్టీరియో ట్రిప్లెట్స్‌(మూడు కొలతలతో) స్పష్టమైన ఇమేజ్ ను పంపింది. అది కూడా అంతరిక్షం నుంచి 100కిలోమీటర్ల దూరంలో ఉండి చంద్రునిపై ఉన్న తలాన్ని అంత స్పష్టంగా ఫొటో పంపి ఆశ్చర్యపరిచింది. 

ల్యూనార్ తలంపై ఉండి ఈ మూడు కోణాల్లో తీసిన ఫొటోపై ఇస్రో విశ్లేషణ జరిపింది. ఓ క్రేటర్(చంద్రుని ఉపరితలంపై ఏర్పడ్డ గుండ్రని ఆకారం గుంత)ను ఇంతటి స్థాయిలో స్పష్టమైన చిత్రం తీయగలిగింది. ఇంకా ఈ కెమెరా పనితనంతో చంద్రునిపై ఉన్న.. 
* క్రేటర్స్
* లావా ట్యూబ్స్
* రైల్స్
* డొర్సా లేదా రింకెల్ రిడ్జెస్
* గ్రాబెన్ నిర్మాణాలు
* ల్యూనార్ డూమ్స్/కోన్స్

ఇందులో క్రేటర్ సైజ్ ఆధారంగా అక్కడి తలం ఎన్నాళ్లుగా ఏర్పడింది. అక్కడి వాతావరణ పరిస్థితులు, ల్యూనార్ పరివర్తనంపై అంచనా వంటి పలు అంశాలను విశ్లేషించారు. ఆయా వివరాలను ఇస్రో సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.